చిట్టా విప్పిన టాప్ బ్రాండ్!!

Posted By: Prashanth

చిట్టా విప్పిన టాప్ బ్రాండ్!!

 

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా జడ్‌టీఈ తన భవిష్యత్ కార్యచరణను వెల్లడించింది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ల శకంలోకి ప్రవేశించనున్న ఈ బ్రాండ్ 4 ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలను ఈ ఏడాదిలో ప్రవేశపెట్టనుంది. జడ్‌టీఈ పీఎఫ్100, జడ్‌టీఈ టీ98, జడ్‌టీఈ వీ96, జడ్‌టీఈ వీ9ఎస్ మోడల్స్‌లో ఈ పీసీలు రూపుదిద్దుకోనున్నాయి. వీటిలో జడ్‌టీఈ పీఎఫ్100 (10 అంగుళాల డిస్ ప్లే), టీ98 (7 అంగుళాల డిస్ ప్లే)లు క్వాడ్ - కోర్ టెగ్రా ప్రాసెసర్ పై రన్ అవుతాయి. తక్కిన రెండు టాబ్లెట్‌లలో డ్యూయల్ కోర్ చిప్‌లను అమర్చారు.

క్వాడ్ కోర్ టెగ్రా ప్రాసెసర్ పై పని చేసే టాబ్లెట్ పీసీల ఫీచర్లను పరిశీలిస్తే:

* ప్రాసెసర్ క్లాక్ వేగం 1.5 GHz,

* 1జీబి ర్యామ్,

* వేగవంతమైన 3జీ కనెక్టువిటీ,

* Icera 450 modem సపోర్ట్,

* ఎక్సటర్నల్ మెమెరీ 16జీబి,

* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం.

డ్యూయల్ కోర్ చిప్ ప్రాసెసర్ల పై రన్ అయ్యే జడ్‌టీఈ వీ96, వీ9ఎస్ ఫీచర్లు:

ఈ టాబ్లెట్ పీసీల డిస్‌ప్లే పరిమాణం 10 అంగుళాలు, డ్యూయర్ కోర్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్లను ఈ పీసీలు సపోర్ట్ చేస్తాయి. ఇంటర్నల్ మెమరీ 16జీబి కాగా ర్యామ్ సామర్ధ్యం 16జీబి. పీసీలలో వోఎస్‌లు మాత్రం వేరు వీ9ఎస్ మోడల్ ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. వీ96 మాత్రం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 5 మెగా పిక్సల్ రేర్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలతో సమాన స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot