బ్యాండ్‌విడ్త్‌ను కంట్రోల్ చేసుకునేందుకు 5 బెస్ట్ టూల్స్
దేశంలోని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వివిధ బ్యాండ్‌విడ్త్‌లలో డేటా ప్లాన్‌లను ఆఫర్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్లాన్‌లలో భాగంగా యూజర్ సెలక్ట్ చేసకునే బ్యాండ్‌విడ్త్‌ను బట్టి అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాన్ని ఐఎస్‌పీలు ఫిక్స్ చేయటం జరుగుతుంది.

ఈ బ్యాండ్‌విడ్త్‌ను ఓ నిర్థిష్టమైన అవగాహనతో నెల మొత్తం పొదుపుగా వినియోగించుకున్నట్లయితే దాదాపుగా ఎక్స్‌ట్రా ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు. విండోస్ యూజర్లు నెలవారీ బ్యాండ్‌విడ్త్‌ను పొదుపుగా వినియోగించుకునేందుకు పలు తీరైన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బిట్‌మీటర్ ఓఎస్ (BitMeter OS)
ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా Mac OSX, Windows, Linux డివైస్‌లను మానిటర్ చేసుకునే వీలుంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ యూసేజ్‌ను గ్రాఫ్స్ ఇంకా చార్ట్స్ రూపంలో విశ్లేషించుకునే వీలుంటుంది. ఈ డేటా ప్రతి సెకనుకు అప్‌డేట్ అవుతుంటుంది. ఇవే కాకుండా బ్యాండ్‌విడ్త్ యూసేజ్‌కు సంబంధించి నోటిఫికేషన్స్ అలానే అలర్ట్స్‌ను సెట్ చేసుకునే వీలుంటుంది. బిట్‌మీటర్ ఓఎస్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్యాండ్‌విడ్త్‌ను పొదుపుగా వాడుకునేందుకు ఈ టూల్ సహాయపడుతుంది

ఫ్రీమీటర్ బ్యాండ్‌విడ్త్ మానిటర్ (FreeMeter Bandwidth Monitor)
ఈ యూజర్ ఫ్రెండ్లీ టూల్ ద్వారా, మీ కంప్యూటర్‌కు సంబంధించిన నెట్‌వర్క్ స్పీడ్‌ను పూర్తిస్థాయిలో విశ్లేషించుకునే వీలుంటుంది. డేటా వినియోగానికి సంబంధించిన రియల్ టైమ్ విజువల్ రిప్రెంజంటేషన్‌ను ఈ టూల్ ఆఫర్ చేస్తుంది. చిన్న సైజు డిస్‌ప్లేతో వచ్చే టూల్‌ను స్ర్కీన్ పై ఎక్కడికి కావాలంటే అక్కడికి డ్రాగ్ చేసుకునే వీలుంటుంది.

షాప్లస్ బ్యాండ్‌విడ్త్ మానిటర్ (ShaPlus Bandwidth Meter)
కంప్యూటర్ తెర పై కొద్ది పాటి ప్లేస్‌ను మాత్రమే ఆక్రమించుకోగలిగే ఈ టూల్ బ్యాండ్‌విడ్త్ యూసేజ్‌కు సంబంధించిన నెట్‌వర్క్ ట్రాఫిక్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి చూపుతుంది. దీని బట్టి డేటాను పొదుపుగా వినియోగించుకునే వీలుంటుంది. రోజువారి ట్రాఫిక్ స్టేటస్‌తో పాటు నెలవారి ట్రాఫిక్ స్టేటస్‌ను కూడా ఇక్కడ తెలుసుకునే వీలుంటుంది.

బ్యాండ్‌విడ్త్‌డి (BandwidthD)
ఇంటర్నెట్‌లో ఉచితంగా లభ్యమవుతోన్న బ్యాండ్‌విడ్త్‌డి టూల్ డేటా వినియోగాన్ని బ్యాక్‌గ్రౌండ్ నుంచే ఎప్పటికప్పుడు మానిటిర్ చేస్తుంటుంది. ఐపీ అడ్రస్‌లకు సంబంధించిన లాగ్ అవుట్ డేటాను ఎప్పటికప్పుడు ఈ టూల్ నోట్ చేసుకుని సీడీఎఫ్ పార్మాట్‌లో భద్రపరుస్తుంది. అంతేకాకుంగా ఆ డేటాను బ్యాకెండ్ సర్వర్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది.

మానిటర్ బ్యాండ్‌విడ్త్ యూసేజ్ సాఫ్ట్‌వేర్ (Monitor Bandwidth Usage Software)
విండోస్ కోసం అభివృద్ది చేయబడిన ఈ ప్రత్యేకమైన టూల్ ద్వారా మీ నెట్‌వర్క్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకునే వీలుటుంది. నెట్‌వర్క్ యూసేజ్‌కు సంబంధించి హిస్టరీని కూడా గ్రాఫ్స్ రూపంలో ఈ టూల్ డిస్‌ప్లే చేయగలుగుతుంది. ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ఈ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








