ఈ OSలను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

Written By:

కొత్తగా ల్యాప్‌టాప్‌ను తీసుకున్నారా..? అందులో ఆపరేటింగ్ సిస్టం లోడ్ చేయలేదా..? కొత్త విండోస్ ఓఎస్‌ను కొనుగోలు చేసేందుకు డబ్బులు వెచ్చిస్తున్నారా..? ఏం అక్కర్లేదు. మైక్రోసాఫ్ట్ విండోస్‌కు ప్రత్యామ్నాయంగా 5 ఆపరేటింగ్ సిస్టంలు మీ కోసం మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఇవి పూర్తిగా ఉచితం. వీటిని ఓ లుక్కేద్దాం రండి..

Read More : డెల్ కొత్త ల్యాప్‌టాప్, ఫీచర్లు వింటే షాక్ అవుతారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రీమిక్స్ ఆపరేటింగ్ సిస్టం

ఈ ఆపరేటింగ్ సిస్టంలను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

ఆండ్రాయిడ్ ప్రేమికులకు ఈ ఉచిత ఆపరేటింగ్ సిస్టం ఎంతగానో నచ్చుతుంది. Android-x86 ప్రాజెక్ట్ ఆధారంగా డిజైన్ చేయబడిన ఈ రీమిక్స్ ఆపరేటింగ్ సిస్టంను www.jide.com ద్వారా ఉచితంగా పొందవచ్చు. అన్ని రకాల కంప్యూటర్‌లను ఈ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఓఎస్‌ను ఒక్కసారి డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు తరచూ అప్‌డేట్‌లను పొందవచ్చు. సిస్టం మెమొరీలోనే ఈ ఆపరేటింగ్ సిస్టంను ఇన్‌స్టాల్‌ చేయాల్సిన అవసరం లేదు, పోర్టబుల్‌ యూఎస్బీ డ్రైవ్‌లో ఉంచుకుని బూట్‌ చేయవచ్చు. ప్రత్యేకమైన ఇకో సిస్టంతో వస్తున్నఈ ఆపరేటింగ్ సిస్టంలో మల్టీటాస్కింగ్ బాగుంటుంది. గూగుల్ ప్లే స్టోర్ లో రీమిక్స్ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులో లేదు. apk installer file సహాయంతో ఓఎస్ ను పొందవచ్చు.

 

Haiku Project

ఈ ఆపరేటింగ్ సిస్టంలను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

ఈ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంను పూర్తిగా పర్సనల్ కంప్యూటింగ్ కోసం డిజైన్ చేసారు. ఈ ఆపరేటింగ్ సిస్టంను మీరు పొందాలంటే ముందుగా http:www.haiku-os.orgలోకి పూర్తి వివరాలను తెలుసుకోవల్సి ఉంటుంది. ఈ ఓఎస్ సెటప్‌కు అసరమైన ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత ఆ ఫైల్స్‌ను డివైస్ హార్డ్‌డ్రైవ్‌లోకి గాని లేదా యూఎస్బీ డ్రైవ్ అలానే లైవ్ సీడీలోకి స్టోర్ చేసుకుని ఆ తరువాత బూట్ చేసుకోవచ్చు. విండోస్ టాస్క్‌బార్ తరహాలో Haiku డెస్క్‌బార్ ఆప్షన్‌తో వస్తోంది. స్కీన్ టాప్ రైట్ కార్నర్‌లో డీఫాల్ట్‌గా కనిపించే డెస్క్‌బార్ ఆప్షన్ ద్వారా యాప్స్ ఇంకా సెట్టింగ్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైన వెబ్‌బ్రౌజర్, ఈమెయిల్ క్లైంట్‌లు ఆకట్టుకుంటాయి.

ReactOS

ఈ ఆపరేటింగ్ సిస్టంలను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

విండోస్ NT డిజైన్ ఆర్కిటెక్షన్ ఆధారంగా డిజైన్ చేసిన ఈ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం పై విండోస్ యాప్స్ అలానే డ్రైవర్స్ వర్క్ అవుతాయి. http:www.reactos.org ద్వారా ఈ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

 

Syllable Desktop

ఈ ఆపరేటింగ్ సిస్టంలను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

ఈ ఉచిత ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం పెంటియమ్ అందుకు అనుకూల ప్రాసెసర్ల పై రన్ అవుతుంది.

 

క్రోమియమ్

ఈ ఆపరేటింగ్ సిస్టంలను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

గూగుల్ అభివృద్ధి చేసిన క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంకు మార్కెట్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. గూగుల్ సెర్చ్, జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్‌తో వస్తోన్న క్రోమియమ్ ఓఎస్ యూజర్ ప్రెండ్లీ కంప్యూటింగ్‌ను చేరువ చేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Free alternatives to Microsoft Windows operating system. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot