కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

Written By:

డెస్క్‌టాప్ కంప్యూటర్‌లకు అప్‌డేటెడ్ వర్షన్‌గా పుట్టుకొచ్చిన ల్యాప్‌‌టాప్‌లు, పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని జాబ్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లను అనేక విధాలుగా వాడుకుంటున్నారు. ఇటీవల కంప్యూటర్‌ కొనాలి అనుకునే వారికి ముఖ్యంగా 3 ప్రధానమైన ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

మొదటిది డెస్క్‌టాప్‌, అంటే మానిటర్‌, సిపియు, కీబోర్డ్‌, మౌస్‌ ఇలా విడివిడిగా ఉంటాయి. రెండవది లాప్‌టాప్‌ డెస్క్‌టాప్‌ కన్నా లాప్‌టాప్‌ చాలా చిన్నదిగా సింపుల్‌గా ఉంటుంది. కాంపోనెంట్స్ మార్చుకునే విషయంలో డెస్క్ టాప్ యూజర్ కు ఉన్నంత స్వేచ్ఛ ల్యాప్ టాప్ యూజర్ కు ఉండదు. ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే ముందు గుర్తుపెట్టుకోవల్సిన 5 ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం...

Read More: ఆదివారం ఈ-మెయిల్స్ వెళతాయా..?, ఓ బామ్మకొచ్చిన సందేహం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

మీరు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్ ఖచ్చితమైన డిస్‌ప్లే సైజులో ఉండాలి. 15 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ల్యాప్‌టాప్ మీ డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు మంచి రీప్లేస్‌మెంట్‌గా భావించవచ్చు. మార్కెట్లో 12 అంగుళాల సైజులో ల్యాప్‌టాప్‌లు దొరకుతున్నప్పటికి, ఇవి డెస్క్‌టాప్‌తో పోటీగా పనిచేయకపోవచ్చు.

 

కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

మీరు ఎంపిక చేసుకునే ల్యాప్‌టాప్‌కు పోర్ట్స్ (Ports) చాలా ముఖ్యం. స్టాండర్డ్ ల్యాప్‌టాప్‌కు కనీసం రెండు పోర్ట్స్ అయినా ఉండాలి. వీటి ద్వారా మీ డివైస్‌ను రకరకాల డివైస్‌లకు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఆడియో జాక్ కూడా అవసరం.

 

కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

విండోస్ 8 అలానే విండోస్ 10తో అన్ని ల్యాప్‌టాప్‌లు డిటాజబుల్ డిస్‌ప్లేలతో లభ్యమవుతున్నాయి. ఈ కన్వర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌లను ల్యాప్ అలానే, టాబ్లెట్ పీసీలా రెండు రకాలుగా వాడుకోవచ్చు.

కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

మార్కెట్లో దొరుకుతున్న పలు విండోస్ టచ్‌స్ర్కీన్ ల్యాప్‌టాప్‌లు ఫేలవమైన పనితీరును కలిగి ఉండటంతో నెగిటివ్ టాక్ వ్యక్తమవుతోంది. కాబట్టి, ఆధునిక వర్షన్ ల్యాప్‌టాప్‌ల ఎంపికలో ఆచితూచి వ్యవహరించండి.

కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

మార్కెట్లో గూగుల్ క్రోమ్ బుక్‌ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా స్టూడెంట్ కమ్యూనిటీ ఈ క్రోమ్‌బుక్‌లకు అట్రాక్ట్ అవుతోంది. క్రోమ్‌బుక్‌లను వాడుతోన్న చాలామంది యూజర్లు పాజిటివ్ రెస్పాన్స్‌ను వ్యక్తం చేస్తున్నారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Mistakes You Should Avoid While Buying A New Laptop. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot