మానిటర్ కొనుగోలు చేస్తున్నారా, మీ కోసం 5 విషయాలు !

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కంప్యూటర్ అనేది సర్వ సాధారణం అయిపోయింది. అయితే చాలామంది మార్కెట్లోకి కొత్త మానిటర్ ఏం వచ్చినా దానిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయంలో మానిటర్ కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. డిస్‌ప్లే టైప్‌, రెస్పాన్స్‌ టైమ్‌, వ్యూ యాంగిల్స్‌, కనెక్టివిటీ ఆప్షన్స్‌ వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి.

జియోతో పోటీకి సై, రూ. 999కే Airtel 4జీ హాట్‌స్పాట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లేలలో మూడు రకాలు

మాములుగా డిస్‌ప్లేలలో మూడు రకాలు ఉంటాయి. అవి టీఎన్‌, ఐపీఎస్‌, వీఏ. టీఎన్‌. కొత్తగా మానిటర్ కొనుగోలు చేసే సమయంలో ఈ మూడింటి పనితీరును పరిగణలోకి తీసుకుని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ట్విస్టెడ్‌ నెమాటిక్‌ డిస్‌ప్లే

టీఎన్‌(ట్విస్టెడ్‌ నెమాటిక్‌ డిస్‌ప్లే) మానిటర్స్‌కు రెస్పాన్స్‌ టైమ్‌ వేగంగా ఉంటుంది. అయితే వ్యూ యాంగిల్స్‌ అంతగా బాగుండవు. మీరు గేమ్స్‌ కోసం కావాలనుకుంటే టీఎన్‌ స్క్రీన్ ఎంచుకోవచ్చు.

ఐపీఎస్

ఐపీఎస్(ఇన్‌ ప్లేన్‌ స్విచ్చింగ్‌) ప్యానెల్స్‌కు కలర్‌ రీప్రొడక్షన్‌ కాపబులిటీ ఉంటుంది. కానీ రీఫ్రెష్‌ చాలా స్లోగా అవుతాయి. ఫోటోగ్రాఫర్స్‌, గ్రాఫిక్‌ డిజైనర్స్‌ కోసమైతే ఐపీఎస్‌ డిస్‌ప్లే ఎంచుకోవచ్చు.

వీఏ..

వీఏ(వర్టికల్‌ అలైన్‌మెంట్‌ ప్యానెల్స్‌)లో టీఎన్‌, ఐపీఎ్‌సలో ఉన్న అడ్వాంటేజ్‌లన్నీ ఉంటాయి. మంచి వ్యూ యాంగిల్స్‌, కాంట్రాస్ట్‌ వంటి ప్రయోజనాలున్నాయి. మీరు రైటర్స్‌ అయినా, వెబ్‌ బ్రౌజింగ్‌ కోసమే అయినా వీఏ మానిటర్‌ను ఎంచుకోవచ్చు.

రెస్పాన్స్‌ టైమ్‌

సాధారణంగా రెస్పాన్స్‌ టైమ్‌ను మిల్లీసెకండ్స్‌లో లెక్కిస్తారు.కాబట్టి మానిటర్ కొనుగోలు సమయంలో లోయర్‌ రెస్పాన్స్‌ టైమ్‌ ఉన్న మానిటర్‌ ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. దీని ద్వారా ఇమేజ్ తేడాలు క్విక్‌ యాక్షన్‌ మూవీస్‌, గేమ్స్‌ ఆడే సమయంలో ఇబ్బందులు తలెత్తవు

వ్యూ యాంగిల్‌

మంచి వ్యూ యాంగిల్ ఉన్న మానిటర్ లో మీరు ఎటువైపు కూర్చున్నా మానిటర్‌లో రంగులు, బొమ్మలు స్పష్టంగా కనిపించే ఉండాలి.

డీవీఐ, హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు

మానిటర్‌కు డీవీఐ, హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు కూడా ఉండేలా చూసుకోవాలి. హెచ్‌డీఎమ్‌ఐ పోర్టు సహాయంతో కామ్‌కార్డర్‌, డిజిటల్‌ కెమెరా, మీడియా ప్లేయర్‌ వంటి డివైజ్‌లను మానిటర్‌కు నేరుగా కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇలా కనెక్ట్‌ చేసుకోవడం ద్వారా ఫొటోలను, వీడియోలను మానిటర్‌లో చూడవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Things You Should Know When Shopping For A Monitor Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot