మీ పీసీలో చెత్త వదిలించుకునేందుకు చక్కటి 5 మార్గాలు..

|

మీ పీసీలో స్పేస్ సమస్య తలెత్తుతోందా.. మీకు సరిగ్గా స్పేస్ అవసరం అయినప్పుడే నో అనే ఎర్రర్ మిమ్మల్ని చికాకు పెడుతోందా. అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడే వారి కోసం కొన్ని ప్రత్యేక టిప్ మీ ముందు ఉంచుతున్నాం. విండోస్ పీసీలోని ఫైల్స్, ఫోల్డర్స్ సంఖ్య పెరిగే కొద్దీ అందులోని స్పేస్ పెరిగిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో ఏవి డిలీట్ చేయాలనే సందేహాలు తలెత్తుతాయి. అలాంటప్పుడు ఏం మీ విలువైన డేటా నష్టపోకుండా ఎలాంటి ఫైల్స్ డిలీట్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు డిలీట్ చేసే వాటిలో ఎలాంటి ఫైల్స్ డిలీట్ చేస్తే పెద్దగా నష్టం ఉండదో తెలుసుకుందాం. విండోస్ లో ఓ 5 ఫైల్స్ మాత్రం డిలీట్ చేయడం ద్వారా స్పేస్ పొందే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.

 

షియోమి మరో సంచలనం, రూ.10 వేలకే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీషియోమి మరో సంచలనం, రూ.10 వేలకే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీ

హైబర్నేషన్ ఫైల్ :

హైబర్నేషన్ ఫైల్ :

మీరు ఎప్పుడైనా హైబర్నేషన్ మోడ్ సెలక్ట్ చేసుకోగానే వెంటనే మీ పీసీ మీరు గతంలో చేసిన వర్క్, లేదా ప్రోగ్రాంను స్టోర్ చేస్తుంది. ఎప్పుడైనా కంప్యూటర్ రీస్టార్ట్ అయితే మీరు పని ఆపేసిన దగ్గరి నుంచే పనిచేసే వీలుంటుంది. అయితే మీ పని పూర్తి అయిన తర్వాత ఈ హైబర్నేషన్ ఫైల్ ను డిలీట్ చేసేయొచ్చు. దీన్ని డిలీట్ చేసేందుకు ఓపెన్ కమాండ్ లోకి వెళ్లి "powercfg.exe/hibernate off" అని టైప్ చేసి, hiberfil.sys ఫైల్ ను డిలీట్ చేయాలి. అప్పుడు మీకు కొంత స్పేస్ కలిసి వస్తుంది.

టెంప్ ఫోల్డర్ :

టెంప్ ఫోల్డర్ :

టెంపరరీ విండోస్ ఫైల్స్ ను డిలీట్ చేయడం ద్వారా కూడా స్పేస్ ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫైల్స్ ను విండోస్ పెద్దగా వాడటం లేదు. అందుకోసం కమాండ్ లోకి వెళ్లి విండోస్ టెంప్ అని టైప్ చేసి కంట్రోల్ ప్లస్ A క్లిక్ చేస్తే టెంపరరీ ఫైల్స్ అన్నీ డిలీట్ అవుతాయి.

రీసైకిల్ బిన్ :
 

రీసైకిల్ బిన్ :

ఇక రీసైకిల్ బిన్ ను ఎప్పటికప్పుడు ఖాళీ చేయడం ద్వారా మీరు స్పేస్ ను పొందే వీలుంది. మీరు డిలీట్ చేసిన ఫైల్స్ కూడా మీ స్పేస్ ను తినేస్తాయి. అందుకే రీసైకిల్ బిన్ ను ఖాళీగా ఉంచుకోండి.

విండోస్ ఓల్డ్ ఫోల్డర్ :

విండోస్ ఓల్డ్ ఫోల్డర్ :

కొత్త విండోస్ వెర్షన్ లో పాత విండోస్ ఫైల్స్ కు చెందిన వాటిని స్టోరేజీలో ఉంచుతుంది. ఈ ఫైల్స్ సాధారణంగా ప్రతీ పది రోజులకు ఒక సారి డిలీట్ అవుతుంటాయి. అయితే ఈ లోగా మాన్యువల్ గా డిలీట్ చేస్తే స్పేస్ కలిసి వచ్చే అవకాశం ఉంది.

డౌన్ లోడెడ్ ప్రోగ్రాం ఫైల్స్ :

డౌన్ లోడెడ్ ప్రోగ్రాం ఫైల్స్ :

సాధారణంగా ఇంటర్ నెట్ ఎక్స్ ప్లోరర్లో డౌన్ లోడింగ్ అనంతరం కొన్ని ఫైల్స్ అనవసరమైనవి మిగిలిపోతుంటాయి. అలాంటి వాటిని డిలీట్ చేయడం ద్వారా కూడా స్పేస్ మిగులుతుంది.

Best Mobiles in India

English summary
5 Windows files and folders to delete to save space more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X