ఈ ఏడాది ప్రపంచాన్నివణికించిన క్రూరమైన దాడులు ఇవే !

Written By:

ప్రపంచం శరవేగంగా డిజిటల్ ప్రపంచం వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో కొన్నిసైబర్ అటాక్స్ ప్రపంచాన్ని సవాల్ చేస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ అటాక్స్‌ ప్రపంచానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. కాగా ఈ ఏడాది ర్యామ్‌సమ్‌వేర్‌ అటాక్స్‌ వల్ల ఏర్పడిన నష్టం 5 బిలియన్‌ డాలర్ల(రూ.32,091 కోట్లకు పైన)కు పైగానే ఉందనే వాస్తవాలే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరు దాడులే ప్రపంచాన్ని వణికించాయి.

ఐఫోన్ ఎక్స్ అమ్మకాలు తగ్గుముఖం పట్టే అవకాశం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షాడో బ్రోకర్స్‌

సిరియాపై అమెరికా బాంబు దాడిచేసినందుకు నిరసనగా ఈ గ్యాంగ్ ఓ బగ్ తో కంప్యూట‌ర్ల‌ను హ్యాక్ చేసిన‌ట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాళ్ళ ఆచూకి తెలియకుండానే ఈ దాడికి ఒడిగట్టారు. ఎట‌ర్న‌ల్ బ్లూ హ్యాకింగ్ టూల్‌‌తో కంప్యూటర్లపై దాడి చేశారు. ఈ గ్యాంగ్ వెనుక రష్యాకు లింక్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి.

వాన్నాక్రై

భారత్‌ సహా దాదాపు 100 దేశాలను గడగడలాడించిన సైబర్ దాడి ఇది. 24 గంటల్లో లక్షకుపైగా కంప్యూటర్‌ వ్యవస్థలు ఈ వైరస్‌ బారిన పడినట్లు మాల్‌వేర్‌టెక్‌ ట్రాకర్‌ సంస్థ గుర్తించింది. కంప్యూటర్లలోని డేటాను ఎన్‌క్రిప్ట్‌ చేసి, సొమ్ము చెల్లిస్తేగానీ దాన్ని విడిచిపెట్టబోమంటూ ప్రపంచాన్ని పరుగులు పెట్టించింది.

నాట్‌పెట్యా

అమెరికాలోని కార్పొరేట్‌ దిగ్గజాలు, ఫార్మాస్యూటికల్‌ కంపెనీ మెర్క్‌, డానిష్‌ షిప్పింగ్‌ కంపెనీ, రష్యన్‌ ఆయిల్‌ దిగ్గజం రోస్నేఫ్ట్ వంటి వాటిని పరుగులు పెట్టించిన మాల్‌వేర్‌ ఇది. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాలు దీని బారిన ఎక్కువగా పడ్డాయని సైబర్‌ సెక్యురిటీ సంస్థ సిమాంటెక్ పేర్కొంది.

జోమాటో హ్యాక్‌

భారత్‌లోని అతిపెద్ద రెస్టారెంట్‌ అగ్రిగేటర్లలో ఒకటి. ఈ హ్యాకింగ్ ద్వారా సంస్థకు చెందిన 170 లక్షలకు పైగా యూజర్ల అకౌంట్ల సమాచారాన్ని హ్యాకర్లు డార్క్‌ వెబ్‌లో విక్రయించారు. అయితే అదృష్టశాత్తు యూజర్ల పేమెంట్‌ వివరాలు వేరే ప్రాంతంలో నిక్షిప్తం చేయడంతో, యూజర్లు ఆర్థిక నష్టం బారిన పడలేదు.

ది హెచ్‌బీఓ హ్యాక్‌

గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ టెలివిజన్ గేమ్ మీద ఈ దాడి జరిగింది. ఈ షోకు చెందిన స్క్రీప్ట్‌లను, 1.5 టెర్రాబైట్స్‌ డేటాను ''మిస్టర్‌ స్మిత్‌'' అనే హ్యాకింగ్‌ గ్రూప్‌ దొంగతనం చేసింది. హ్యాకర్లు డిమాండ్‌ చేసిన మొత్తాన్ని హెచ్‌బీఓ చెల్లించిందో లేదో చెప్పడాన్ని మాత్రం ఆ సంస్థ చాలా సీక్రెట్‌గా ఉంచింది.

ఈక్విఫ్యాక్స్‌

అమెరికాలో అతిపెద్ద క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీలో ఈక్విఫాక్స్ ఒకటి. ఈ క్రెడిట్‌ ఏజెన్సీపై దాడికి పాల్పడిన హ్యాకర్లు 145 మిలియన్‌ ప్రజల వ్యక్తిగత డేటాను దొంగతనం చేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Brutal Cyber Attacks That Shook The World In 2017 Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot