ఇండియన్ మార్కెట్‌లో లభ్యమవుతున్న 6 అత్యుత్తమ ట్యాబ్లెట్ పీసీలు

Posted By:

మీ దైనందిన కార్యకలాపాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్... ఆన్‌లైన్ వీడియో వీక్షణ తదితర వినోదాత్మక అంశాలను నిర్వహించుకునేందుకు ట్యాబ్లెట్ పీసీలు ఉత్తమ ఎంపిక. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ గాడ్జెట్‌లు ప్రయాణాల్లో సైతం నెట్ బ్రౌజింగ్‌ను చేరువ చేస్తాయి. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ట్యాబ్లెట్ పీసీలకు మంచి స్పందన లభిస్తోంది. సామ్‌సంగ్, యాపిల్ సహా ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లు ట్యాబ్లెల్ పీసీలను ప్రత్యేక ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని బిజినెస్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లకు బదులుగా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ కంప్యూటింగ్ ఫీచర్లను కలిగి ఉత్తమ ధరల్లో లభ్యమవుతున్న టాప్-5 ట్యాబ్లెట్ పీసీల వివరాలను మీముంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియన్ మార్కెట్‌లో లభ్యమవుతున్న 6 అత్యుత్తమ ట్యాబ్లెట్ పీసీలు

1.) హవావీ మీడియాప్యాడ్ 10 లింక్ ట్యాబ్లెట్ (Huawei MediaPad 10 Link Tablet):

10.1 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 16 కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 6600 ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ, ధర రూ.24,900. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: Flipkart

 

 

నెక్సూస్ 7 ట్యాబ్లెట్ (Nexus 7 Tablet):

2.) నెక్సూస్ 7 ట్యాబ్లెట్ (Nexus 7 Tablet):

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల ఎల్‌సీడీ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 1.2గిగాహెట్జ్ ఎన్-విడిగా టెగ్రా 3 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 1.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వై-ఫై, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4325 ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ. ధర రూ.18,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5100 ట్యాబ్లెట్ (Samsung Galaxy Note 5100 Tablet):

3.) సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5100 ట్యాబ్లెట్ (Samsung Galaxy Note 5100 Tablet):

8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, సీఎమ్ఓఎస్ సెన్సార్), 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, వై-ఫై, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ సపోర్ట్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.29,900. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లెనోవో ఏ2107 ట్యాబ్లెట్ (Lenovo A2107 Tablet):

4.) లెనోవో ఏ2107 ట్యాబ్లెట్ (Lenovo A2107 Tablet):

7 అంగుళాల ఎల్ఈడి కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్, 4 పాయింట్ మల్టీటచ్ స్ర్కీన్, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్

సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, 3జీ, జీపీఎస్, యూఎస్బీ, బ్లూటూత్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి

పొడిగించుకునే సౌలభ్యత, 3550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.9,975.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

యాపిల్ 16జీబి ఐప్యాడ్ మినీ (Apple 16GB iPad Mini)

5.) యాపిల్ 16జీబి ఐప్యాడ్ మినీ (Apple 16GB iPad Mini):

7.9 అంగుళాల ఎల్ఈడి బ్లాక్‌లైట్ డిస్‌ప్లే, అసిస్టివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, డ్యుయల్ కోర్ ఏ5 ప్రాసెసర్, ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ కెమెరా, 1.2 మెగా

పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, ఎడ్జ్, జీపీఎస్, బ్లూటూత్, లైటింగ్ కనెక్టర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 16.3 లితియమ్ పాలిమర్ బ్యాటరీ, ధర రూ.29,900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

అసూస్ ఫోన్ ప్యాడ్ (Asus FonePad):

6.) అసూస్ ఫోన్ ప్యాడ్ (Asus FonePad):

7 అంగుళాల ఎల్ఈడి ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్, ఇంటెల్ ఆటమ్ జడ్2420 1.2 గిగాహెట్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.1 ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్ వీ3.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్ ఇంకా యూఎస్బీ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 4270 ఎమ్ఏహెచ్ లైపో బ్యాటరీ, ధర రూ.15,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:


 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot