మథర్‌బోర్డ్స్ ఫెయిల్ అవటానికి 6 ప్రధానమైన కారణాలు..

ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగం రోజుకురోజుకు పెరిగిపోతోంది. కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కంప్యూటర్ దర్శనమిస్తోంది

|

ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగం రోజుకురోజుకు పెరిగిపోతోంది. కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కంప్యూటర్ దర్శనమిస్తోంది. వ్యక్తగత కంప్యూటర్‌ల నిర్వహణలో భాగంగా కాంపోనెంట్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కాంపోనెంట్స్ పనితీరు సక్రమంగా ఉంటేనా పీసీ వర్కింగ్ కండీషన్ బాగుంటుంది.

8-mistakes-that-will-damage-or-ruin-your-computer-motherboard

మథర్‌బోర్డ్స్ అకారణంగా ఫెయిల్ అవుతుంటాయి..
కంప్యూటర్‌కు సంబంధించిన కీలక కాంపోనెంట్‌లలో మథర్‌బోర్డ్ మొదటి స్థానంలో ఉంటుంది. పీసీకి గుండెకాయిలో వ్యవహిరించే ఈ కాంపోనెంట్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మథర్‌బోర్డ్స్ అనేవి అకారణంగా ఫెయిల్ అయి పోతుంటాయి.మథర్‌బోర్డ్స్ ఫెయిల్యుర్ వెనుక 6 ప్రధానమైన నిర్లక్ష్యపు కారణాలు దాగి ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హీటింగ్ సమస్య..

హీటింగ్ సమస్య..

మథర్‌బోర్డ్స్ ఫెయిల్ అవటానికి ప్రధానమైన కారణం హీటింగ్. వాస్తవానికి కంప్యూటర్‌లలో అమర్చే ప్రతి కాంపోనెంట్ కూడా వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారణంగా వేడి వాతావరణం అనేది నిరంతరం క్రియేట్ అవుతుంటుంది. హీటింగ్ సమస్యను నివారించే క్రమంలో కూలింగ్ ఫ్యాన్‌లను మథర్‌బోర్డులో అమర్చటం జరుగుతుంది. వీటి పనితీరు సక్రమంగా లేకపోయినట్లయితే హీటింగ్ సమస్య అనేది మరింత పెరిగిపోతుంది. దీంతో ఒత్తిడి వాతావరణం క్రియేట్ అయి మథర్‌బోర్డ్స్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది.

 

 

 

షార్ట్ సర్క్యూట్స్..

షార్ట్ సర్క్యూట్స్..

మథర్‌బోర్డ్స్ అనేవి ఎలక్ట్రసిటీని కండక్ట్ చేసి దానిని ఇతర కంప్యూటర్ కాంపోనెంట్‌లకు ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాయి. ఈ ప్రాసెస్ జరిగే సమయంలో మథర్‌బోర్డ్స్ అనేవి ఎటువంటి మెటల్ పదార్థానికి టచ్ కాకూడదు. ఇంటర్నల్ వైర్స్ లేదా సీపీయూ ఛాసిస్ మథర్ బోర్డుకు ఏ మాత్రం టచ్ కాకూడదు. ఒకవేళ వీటితో బోర్డు టచ్ అయినట్లయితే షార్ట్ సర్క్యూట్స్ ఏర్పడి మథర్‌బోర్డ్స్ ఫెయిల్ అయ్యే ప్రమాదముంది.

విద్యుత్ వొల్టేజీలో తేడా..
 

విద్యుత్ వొల్టేజీలో తేడా..

కొన్నికొన్ని సందర్భాల్లో విద్యుత్ సమస్యల వల్ల కూడా మథర్‌బోర్డ్స్ దెబ్బతినే ప్రమాదముంటుంది. సడెన్‌గా తలత్తే వొల్టేజి ప్రాబ్లమ్స్, వాతావారణంలో మార్పులు లేదా పిడుగుల పడుతున్నప్పుడు కంప్యూటర్‌లను పూర్తిగా టర్నాఫ్ చేయటంతో పాటు పవర్ కేబుల్స్‌కు దూరంగా ఉంచాలి.

ఎలక్ట్రికల్ డ్యామేజ్..

ఎలక్ట్రికల్ డ్యామేజ్..

కొన్నికొన్ని సందర్భాల్లో కంప్యూటర్ మెయింటేనెన్స్ సమయంలో టెక్నీషియన్స్ చేసే పొరపాట్ల కారణంగా మథర్‌బోర్డ్స్ ఫెయిల్ అయ్యే ప్రమాదముంది. ర్యామ్ లేదా గ్రాఫిక్స్ కార్డ్ ఇన్‌స్టాలేషన్‌లో తప్పులు ఉన్నా కూడా మథర్‌బోర్డ్స్ అనేవి ఫెయిల్ అవుతుంటాయి.

 

 

ఫేలవమైన ప్రాసెసర్ లేదా వీడియో కార్డ్..

ఫేలవమైన ప్రాసెసర్ లేదా వీడియో కార్డ్..

కొన్ని కొన్ని సందర్భాల్లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సీపీయూ) వల్ల కూడా మథర్‌బోర్డ్స్ దెబ్బతినే ప్రమాదముంది. అప్పటికే డ్యామేజ్ అయిన ఉన్న సీపీయూలను మథర్ బోర్డ్స్‌కు అనుసంధాంచినటం వల్ల ఓవర్ హీటింగ్ సమస్యలు తలెత్తి పర్యవసానంగా మథర్‌బోర్డ్స్ ఫెయిల్ అవుతుతాయి. సీపీయూ తరహాలోనే వీడియో కార్డ్స్ కూడా మథర్ బోర్డ్స్‌కు కనెక్ట్ అయి ఉంటాయి. వీటి పనితీరులో కూడా లోపాలు ఉన్నట్లయితే ఆ ప్రభావం మథర్‌బోర్డ్స్ పై పడుతుంది.

దుమ్ము పేరుకుపోవటం వల్ల..

దుమ్ము పేరుకుపోవటం వల్ల..

పర్సనల్ గాడ్జెట్‌ల క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే లోపలి కాంపోనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. మనం ఉపయోగించే కంప్యూటర్లలో దుమ్ము అతిగా పేరుకుపోవటం వల్ల సీపీయూ లోపలి భాగంలో వేడి ఉష్ణోగ్రతలు అధికమై మథర్‌బోర్డ్ ఫెయిల్ అయ్యే ప్రమాదముంది.


Best Mobiles in India

English summary
6 Mistakes That Will Damage Or Ruin Your Computer Motherboard.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X