మీకు, ఈ Ports గురించి తెలుసా..?

కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్‌టర్నల్ డివైస్‌లను కనెక్ట్ చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసే వ్యవస్థనే పోర్ట్ (port) అని పిలుస్తారు. ఈ పోర్టుకు సబంధించి ఒకవైపు మథర్ బోర్డులో సిట్ అయి ఉంటే మరొక భాగం కనెక్టర్ రూపంలో మనకు అందుబాటులో ఉంటుంది. ఈ పోర్ట్స్ ద్వారా డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు, నెట్‌వర్క్‌ను షేర్ చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్‌లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. వేరువేరు ఉద్దేశ్యాలతో డిజైన్ కాబడిన 6 ముఖ్యమైన పోర్టులకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

USB

USB (యూనివర్శల్ సీరియల్ బస్), ఈ విధమైన కమ్యూనికేషన్ స్టాండర్డ్ పోర్టును కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఫ్లాష్ డ్రైవ్స్ ఇలా రకరకాల గాడ్జెట్‌లలో వినియోగించటం జరుగుతోంది. యూఎస్బీ పోర్ట్ ఆధారంగానే ఇతర ఎక్స్‌టర్నల్ డివైస్‌లను స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌కు కనెక్ట్ చేసే వీలుంటుంది. యూఎస్బీ పోర్ట్ సహాయంతో ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్‌కు వేగవంతంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే వీలుంటుంది. ఒరిజినల్ యూఎస్బీ, బేసిక్ యూఎస్బీ ట్రైడెంట్, సూపర్ స్పీడ్ యూఎస్బీ, యూఎస్బీ 3.0 ఇలా అనేక మోడల్స్‌లో యూఎస్బీ పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

HDMI

HDMI (హైడెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్‌ఫేస్), ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఈ కనెక్టువిటీ పోర్టును కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్ అలానే టీవీలలో ఉపయోగిస్తున్నారు. ఈ పోర్ట్ ద్వారా హైడెఫినిషన్ ఇంకా అల్ట్రా హైడెఫినిషన్ డివైస్‌లను కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ లేదా టీవీకి కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.

Audio

ఆడియో పోర్ట్ ద్వారా ఇతర ఆడియో అవుట్‌పుట్ డివైస్‌లను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఆడియో పోర్ట్ అంటే ముందుగా మనుకు గుర్తుకు వచ్చేది 3.5mm పోర్ట్. స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువుగా వినియోగిస్తోన్న ఆడియో పోర్ట్ ఇదే. ఈ పోర్టు ద్వారానే స్టీరియో హెడ్‌ఫోన్స్ అలానే సరౌండ్ సౌండ్ ఛానల్స్‌ను స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. కంప్యూటర్లకు వివిధ రకాల ఆడియో డివైస్‌లను కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా 6 కనెక్టర్ పోర్టును ఇస్తున్నారు.

Video port

VGA పోర్ట్స్ అనేక సిస్టమ్స్‌లో మనకు కనిపిస్తాయి. ఈ పోర్ట్స్ ద్వారానే కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, వీడియో కార్డ్స్, హైడెఫినిషన్ టీవీలను కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. VGA port వీడియో సిగ్నల్స్‌‌ను క్యారీ చేస్తుంది.

USB Type-C

ఈ మధ్య రిలీజ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో USB Type-C port అనే స్పెసిఫికేషన్‌ను మనం వింటున్నాం. వాస్తవానికి, యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అనేది ఓ కొత్త యూఎస్బీ స్టాండర్డ్. దీన్నే యూఎస్బీ 3.1 అని కూడా పిలుస్తారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అన్ని యూఎస్బీ వర్షన్‌లకు ఇది అప్‌డేటెడ్ వర్షన్. ప్రస్తుతానికి మనం వాడుతున్న యూఎస్బీ టైప్ - A, టైప్ - B పోర్ట్స్ కేవలం ఒక సైడ్ మాత్రమే కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన USB Type-C port రెండు వైపులా కనెక్ట్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తుంది. USB Type-C port డేటాను హై స్పీడ్ వేగంతో ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అలానే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు.

Ethernet port

ఈ పోర్ట్ ద్వారా ఒక డివైస్‌లోని నెట్‌వర్క్‌ను వేరొక డివైస్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది. ఈ టెక్నాలజీలో లేటెస్ట్ వర్షన్ అయిన Gigabit Ethernet వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ రేటును కలిగి ఉంది. ఈ పోర్టు ద్వారా సెకనుకు 10గిగాబైట్స్ వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Important Ports You Should Know About. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting