‘రచ్చ’ రేంజ్‌లో శరవేగంగా..?

Posted By: Staff

 ‘రచ్చ’ రేంజ్‌లో శరవేగంగా..?

 

అత్యుత్తమ కంప్యూటింగ్ టెక్నాలజీతో టాబ్లెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకన్న శామ్‌సంగ్ గెలక్సీ టాబ్లెట్ సిరీస్ మరో మైలురాయిని అధిగమించేందుకు కసరత్తులు పూర్తి చేస్తోంది. సులువైన కంప్యూటింగ్‌కు తోడ్పడే విధంగా ఆధునిక ఫీచర్లతో కూడిన టాబ్లెట్ పీసీని శామ్‌సంగ్ వ్ళద్ధి చేస్తుంది. 7 అంగుళాల స్ర్కీన్ నమూనాలో రూపుదిద్దుకుంటున్న ఈ డివైజ్ అమెజాన్ కిండిల్ ఫైర్‌కు పోటీదారుగా నిలవనుంది.

శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 7.0 రాబోతున్న ఈ డివైజ్ మోడల్ నెంబర్ జీటీ-పీ3100 ఫీచర్లను పరిశీలిస్తే:

* 7 అంగుళాల అత్యుత్తమ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్) ,

*   ఆర్మ్ 11 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

*   ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

*  ఉత్తమ క్వాలిటీ కెమెరా స్పెసిఫికేష‌న్స్,

శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్న శామ్‌సంగ్ గెలక్సీ 7.0 ట్యాబ్ అంతర్జాతీయ విపణిలోకి త్వరలో ప్రవేశించనుంది. ధర ఇతర ఫీచర్ల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot