షార్ప్ ‘న్యూ సునామీ’ అలర్ట్!!

Posted By: Super

షార్ప్ ‘న్యూ సునామీ’ అలర్ట్!!
‘‘షార్ప్ టాబ్లెట్ల సునామీ అరచేతి కంప్యూటర్ల సెక్టార్ ను కుదిపేయునుంది. ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు షార్ప్ సరికొత్త  7 అంగుళాల ‘మీడియా టాబ్లెట్’ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇది వరుకే ‘షార్ప్’ 5.5, 10.8 వర్షన్ లలో టాబ్లెట్ పీసీలను మార్కెట్లో విడుదల చేసింది.

క్లుప్తంగా మీడియా టాబ్లెట్ ఫీచర్లు:

- 7 అంగుళాల స్క్ర్రీన్, 1024 x 600 పిక్సల్ రిసల్యూషన్ తో,

- ఆండ్రాయిడ్  హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,

- డ్యూయల్ కోర్ టెగ్రా 2 ప్రాసెసర్,

- 8జీబీ స్టోరేజి సామర్ధ్యం,

- 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

- 40MBps స్పీడ్ సామర్ధ్యం గల WiMax అపిక్లేషన్,  Galapago’s ఆన్ లైన్ స్టోర్ అప్లికేషన్ లను టాబ్లెట్లో ముందుగానే  ప్రీ ఇన్స్ టాల్  చేశారు. ఈ అప్లికేషన్   సౌలభ్యతతో 40,000 రకాల న్యూస్ పేపర్లతో పాటు  పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

- డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘షార్ప్ మీడియా టాబ్లెట్’ ధరకు సంబంధించి  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot