భళా బాలికా: 15 నిమిషాల్లో ల్యాప్‌టాప్‌ను విప్పదీసి బిగించేస్తుంది!!

Posted By:

వరల్డ్ రికార్డ్స్ యూనివర్శిటీ (యూకే) ప్రతిష్టాత్మకంగా బహుకరించే గౌరవ డాక్టరేట్ తమిళనాడుకు చెందిన 9 సంవత్సరాల బాలికను వరించింది. కోయిల్‌పాల్యం‌కు చెందిన పి.ఆదర్శని 15 నిమిషాల వ్యవధిలో ల్యాప్‌టాప్‌ను పూర్తిగా విప్పదీసి బిగించినందుకుగాను ఈ ఘనత ఆమెకు దక్కింది.

భళా బాలికా: 15 నిమిషాల్లో ల్యాప్‌టాప్‌ను విప్పదీసి బిగించేస్తుంది!!

గతవారం వియాత్నంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదర్శని తన ప్రతిభను నిరూపించుకుని గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నట్లు బాలిక తండ్రి ప్రభు మహాలింగం పత్రికా ప్రతినిధులకు తెలిపారు. ఆదర్శని ఇప్పటికే తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్లు ప్రభు ఈ సందర్భంగా పాత్రికేయులకు తెలిపారు.

తండ్రి స్వతహాగా ఓ ఐటీ సొల్యూషన్స్ సంస్థను నిర్వహిస్తుండటంతో చిన్నతనం నుంచి ఆ వృత్తిపై ఆసక్తిని పెంచుకున్న ఆదర్శని తండ్రితో తరచూ షోరూమ్‌కు వస్తూ ల్యాప్‌టాప్‌లను వేగవంతగా డిస్ మాంటిల్ చేయటంతో పాటు అసెంబుల్ చేయటం నేర్చుకుంది. ఈ ఘనత తనకెంత స్పూర్తినిచ్చిందని, సాంకేతికత పై మరింత పట్టు సాధించే కమ్రంలో కొత్త అప్లికేషన్‌ల రూపకల్పన పై దృష్టిసారిస్తున్నట్లు ఆమె పేర్కొంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting