టాబ్లెట్ మార్కెట్లో భారతీయ లక్ష్మి ‘$99’..!!

Posted By: Staff

టాబ్లెట్ మార్కెట్లో భారతీయ లక్ష్మి ‘$99’..!!

నిన్న రిలయన్స్.. నేడు లక్ష్మీ.. ఇలా టాబ్లెట్ల మార్కెట్లోకి అడుగుపెడుతున్న భారతీయ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఇతర బ్రాండ్లకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇండియన్ కంపెనీ ‘లక్ష్మి యాక్సిస్ కమ్యూనికేషన్’ ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీని ‘$99’ అంటే భారతీయ కరెన్సీలో రూ.6250కి భారతీయ వినియోగదారులకు అందిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక వస్తువుల తయారీలో పేరు మోసిన శ్యామ్‌సంగ్ గెలక్సీ, ఆపిల్ ఐపాడ్ బ్రాండ్లు ఇప్పటికే టాబ్లెట్లను మార్కెట్లో విడుదల చేసి విజయవంతమైన విషయం తెలిసిందే. ఆశ్చర్యకరమకైన విషయమేమిటంటే వీటి ధరలు కాస్త ఎక్కవైనప్పటికి ఇండియన్ టాబ్లెట్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

ఈ నేపధ్యంలో అత్యాధునిక మన్నికతో పాటు తక్కువ ధరతో ప్రవేశపెట్టబోతున్న‘మ్యాజ్నమ్ పెప్పర్’ టాబ్లెట్ పీసీ భారతీయ గ్రామీణ సెక్టార్‌లో మంచి ఆదరణ పొందుతుందని కెంపెని వర్గాలు భరోసా వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ ల్యాండ్ కనెక్షన్లను మొబైల్ ఫోన్లు భర్తీ చేసినట్లు, కంప్యూటర్లను, టాబ్లెట్లు భర్తీ చేస్తున్నాయన్న’’ విశ్లేషణను ‘లక్ష్మి కమ్యూనికేషన్స్’ విశ్వసిస్తుంది.

గుగూల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేసే‘మ్యాజ్నమ్ పెప్పర్’ టాబ్లెట్లను కంపెనీ డిజైన్ చేయగా ,చైనాలో తుదిమెరుగులుదిద్దకుంది. ఈ టాబ్లెట్లలో ప్రధానాకర్షణగా నిలచే అంశం ‘ధర తక్కువ’. కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ మహీంద్ర కుమార్ జైన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ‘మ్యాజ్నమ్ పెప్పర్’ మన్నికకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే లక్ష్మి కమ్యూనికేషన్స్ మరిన్నిఇతర టాబ్లెట్ పీసీలను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే వీటి ధరలు $799 మధ్య ఉంటాయి. 3జీ వ్యవస్థ సపోర్టు చేసే ‘మ్యాజ్నమ్ పెప్పర్’ శక్తివంతమైన 800 మోగాహెర్జ్ తోడ్పాటుతో కూడిన 256 మెగాబిట్ ర్యామ్ కలిగి ఉంది.

ప్రస్తుత టాబ్లెట్ మార్కెట్ తీరును పరిశీలిస్తే 3జీ డివైజ్‌లు మధ్య భారీ స్థాయిలో పోటీ వ్యాపారం నెలకుంది. అయితే వచ్చే ఏడాది 4జీ వ్యవస్థ అందుబాటులోకి రానుండటంతో ఈ పోటి మరింత ఉధృత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ముందుచూపుతో టాబ్లెట్ అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని బీటెల్ మ్యాజిక్, రిలియన్స్, శ్యామ్ సంగ్ వంటి బ్రాండ్లు పలు మోడళ్లను మార్కెట్లో విడుదల చేశాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot