'శాంసంగ్ సిరిస్ 9' లాప్ టాప్ ఫీచర్స్

Posted By: Prashanth

'శాంసంగ్ సిరిస్ 9' లాప్ టాప్ ఫీచర్స్

 

శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ రంగంలో అధ్బుతమైన మార్పులు తెచ్చిన మొబైల్ కంపెనీ. ఇప్పుడు కొత్తగా ఆల్ట్రా పోర్టబుల్ లాట్ టాప్స్‌ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్దమైంది శాంసంగ్. ఇందులో భాగంగా శాంసంగ్ మార్కెట్లోకి 'శాంసంగ్ సిరిస్ 9' పేరుతో ఆల్ట్రాబుక్‌ని విడుదల చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో హాల్ చల్ చేస్తున్న శాంసంగ్ సిరిస్ 9 900X3A-BO1 ప్రత్యేకతలు వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది.

శాంసంగ్ సిరిస్ 9 లాప్ టాప్ బరువు 2.88 పౌండ్లు, మందం 0.64 ఇంచ్‌లు. 13.3 ఇంచ్ డిస్ ప్లే‌ కలిగిన ఈ లాప్ టాప్ 128 జిబి మెమరీ స్టోరేజి కెపాసిటీని కలిగి ఉంది. కష్టమైన అప్లికేషన్స్‌ని కూడా ఈజీగా రన్ చేసేందుకు గాను ఇందులో Core i5-2537M ప్రాససెర్‌ని నిక్షిప్తం చేశారు. బ్యాటరీ బ్యాక్ అప్ సుమారు 7 గంటలు పాటు వస్తుంది.

శాంసంగ్ సిరిస్ 9 లాప్ టాప్‌లో 64-bit విండోస్ 7 హోం ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేశారు. వేరే కంపెనీలకు సంబంధించిన ఆల్ట్రా బుక్ లతో పోల్చి చూస్తే శాంసంగ్ సిరిస్ 9 లాప్ టాప్‌‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 13.3 ఇంచ్ డిస్ ప్లే‌తో పాటు స్క్రీన్ రిజల్యూషన్ 1366x768 ఫిక్సల్‌గా కలిగి ఉంది. ఇందులో ఉన్న ఎస్ఆర్‌ఎస్ ప్రీమియమ్ సౌండ్ స్పీకర్స్ మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తాయి.

త్వరగా డేటాని ట్రాన్ఫర్ చేసుకునేందుకు గాను ఇందులో యుఎస్‌బి 3.0 పోర్ట్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. లాప్ టాప్ ముందు భాగంలో ఉన్న 1.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొనిరావచ్చు. శాంసంగ్ సిరిస్ 9 లాప్ టాప్ 4GB DDR3 మెమరీతో పాటు 3 సంవత్సరాలు వారంటీతో మార్కెట్లో లభిస్తుంది. ఇండియన్ మార్కెట్లో దీని ఖరీదు సుమారుగా రూ 75, 000 వరకు ఉంటుందని అంచనా..

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot