అక్టోబర్ 5న ఇండియాలో ఓ అద్బుతం...

ఇటీవల అమెరికాలో కూడా ఐప్యాడ్‌లను స్కూల్ పిల్లలు చదువుకొవడానికి నిమిత్తం ఫ్రీగా అందజేయడం జరిగింది. ఇప్పుడు ఇదే పద్దతిని ఇండియాలో తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కపిల్ సిబల్ మాట్లాడుతూ కంప్యూటర్ అనేది పాఠశాల నుంచి యూనివర్శిటీ స్థాయి విద్యార్థుల హక్కు అని అన్నారు. సామాన్య ప్రజలకు కూడా కంప్యూటర్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేవలం రూ.1750 (35 డాలర్లు)కే మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఈ కంప్యూటర్‌ని వచ్చే నెల ఐదో తేదిన ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. అసలు రూ.1750కి కంప్యూటర్ ఏంటనీ ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగానే నిజం. దీనిని విడుదల చేయడానికి కారణం రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ అనేది చదువులలో కీలకపాత్ర పోషించనుంది కాబట్టి ఇప్పటి నుండే విద్యార్దులకు కంప్యూటర్‌ని చేరువ చేసే భాగంలో దీనిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ కంప్యూటర్‌కి పెట్టిన పేరు 'మయ'. ఈ కంప్యూటర్‌లో నెట్‌ను కూడా ఉపగించుకోవడంతో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయి.


Click it and Unblock the Notifications