ఎక్కువ ఫీచర్లు... తక్కువ ధర!!!

Posted By: Staff

ఎక్కువ ఫీచర్లు... తక్కువ ధర!!!

 

ఎక్కువ ఫీచర్లు కలిగిన ఆండ్రాయిడ్ టాబ్లెట్ కంప్యూటర్ ను సమంజసమైన ధరకు అందించేందకు మిడియాన్(Medion) సంస్థ ముందుకొచ్చింది. ఈ బ్రాండ్ విడుదల చేసిన ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ ‘మిడియాన్ లైఫ్ ట్యాబ్ P9514’ ఫీచర్లు అదే విధంగా స్పెసిఫికేషన్‌లను పరిశీలిద్దాం.

ఫీచర్లు:

10.1 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, గుగూల్ ఆండ్రాయిడ్ v3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమరీ, డాక్ కనెక్టర్ (వేగవంతమైన ఛార్జింగ్ కోసం), ఫ్లాష్ వెబ్ బ్రౌజింగ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హెచ్డీఎమ్ఐ అవుట్, మైక్రోఎస్డీ మెమరీ కార్డ్, సౌకర్యవంతమైన ఫైల్ మేనేజిమెంట్, విలువ రూ.25,000.

నిరుత్సాహాపరిచే అంశాలు:

ముఖ్యంగా వెలుతురు వాతావరణంలో స్ర్కీన్ పై డాట్స్ కనిపిస్తాయి. పవర్ అదే విధంగా వాల్యుమ్ బటన్లు సున్నితంగా స్పందించవు, బరువు 720 గ్రాములు, కెమెరా క్వాలటీ మన్నకైనది కాదు, తక్కువ బ్యాటరీ సామర్ధ్యం బ్యాకప్ కేవలం 5 గంటలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot