శాంసంగ్ 'కాన్పెస్ట్ టాబ్లెట్' బహు బాగు..

Posted By: Prashanth

శాంసంగ్ 'కాన్పెస్ట్ టాబ్లెట్' బహు బాగు..

 

టెక్నాలజీ రంగం ఎంతగా అభివృద్ది సాధించిందో తెలియాలంటే ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలవుతున్న టాబ్లెట్స్, కంప్యూటర్స్‌ని చూస్తే తెలుస్తుంది. కటింగి ఎడ్జి టెక్నాలజీతో చాలా చిన్నవిగా రూపొందించడమే కాకుండా, చాలా ఫాస్టుగా పని చేస్తాయనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యుత్తమమైన ప్రతిభను కనబరుస్తున్న శాంసంగ్ టాబ్లెట్స్ రంగంలో నూతన ఒరవడిని సృష్టించేందుకు గాను 'కాన్పెస్ట్ టాబ్లెట్'ని ప్రవేశపెట్టనుంది. ఈ టాబ్లెట్ కస్టమర్స్‌ని వేరే ప్రపంచానికి తీసుకెళుతుందనడంలో ఎటువంటి సందేహాం లేదు.

కోరియా ఎలక్ట్రానిక్స్ గెయింట్ అయిన శాంసంగ్ ఈ 'కాన్పెస్ట్ టాబ్లెట్'కి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో ఓ సంచలం సృష్టిస్తుంది. సరిగ్గా మాస్ యూజర్స్ ఏదైతే ఫీచర్స్‌ని కోరుకుంటారో ఆలాంటి అన్ని ఫీచర్స్‌ని ఇందులో నిక్షిప్తం చేయనున్నారు. శాంసంగ్ 'కాన్పెస్ట్ టాబ్లెట్' ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే...

* Flexible

* Transparent screen

* Holographic display

* Adjustable size

శాంసంగ్ అధికారకంగా విడుదల చేసిన ఈ వీడియో టాబ్లెట్ గురించిన పూర్తి సమాచారం అందిస్తుంది. వీడియోలో చూసిన దాని ప్రకారం టాబ్లెట్‌ని మడత పెట్టి క్యారీ పోచ్ లేదా జేబులో పెట్టుకునే విధంగా ఉంది. టాబ్లెట్‌ని చూసేందుకు పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి ఫిజికల్ బటన్స్ ఉండవు. కేవలం గ్లాస్ పేపర్ మాదిరి, హెడ్ ప్రోజక్టర్స్ లాగా ఉంటుంది. ఈ కాన్పెస్ట్ టాబ్లెట్ స్కీన్ డిస్ ప్లేని మనకు కావాల్సిన సైజులో అమర్చుకునే విధంగా తయారు చేయడం జరిగింది. దీని కి సంబంధించిన మిగతా వివరాలు వన్ ఇండియా పాఠకులకు క్లుప్తంగా అందజేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలయజేస్తున్నాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot