విండోస్ 7 టాబ్లెట్!

Posted By: Prashanth

విండోస్ 7 టాబ్లెట్!

 

కంప్యూటింగ్ గ్యాడ్జెట్ల తయారీ కంపెనీ ‘కూపా’ ఆధునిక ఫీచర్లతో కూడిన టాబ్లెట్ కంప్యూటర్‌ను వెలుగులోకి తెచ్చింది. కంపెనీ నుంచి ప్రీమియమ్ మోడల్‌గా వస్తున్న ఈ డివైజ్ పేరు ‘X11 Lux’. విండోస్ 7 ఆధారితంగా ఈ టాబ్లెట్ రన్ అవుతుంది. 7 గంటల 32 నిమిషాల సుధీర్గ బ్యాకప్ నిచ్చే బ్యాటరీని ఈ డివైజ్ ఒదిగి ఉంది. పొందుపరిచిన బుల్ట్-ఇన్ ఫింగర్ ఫ్రింట్ రీడర్ భద్రతా ప్రమాణాలను పటిష్టం చేస్తుంది. మరో స్పెసిఫికేషన్ ‘ప్రిసైజ్ స్మూత్ పెన్ ఇన్‌పుట్’యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌ను చేరువచేస్తుంది.ఈ ప్రెజర్ సెన్సిటివ్ పెన్ ద్వారా నచ్చిన రీతిలో డేటాను లిఖించుకోవచ్చు. ఏర్పాట చేసిన సిమ్‌కార్డ్ స్లాట్ సౌలభ్యతతో టాబ్లెట్‌ను మొబైలింగ్ అవసరాలకు వినియోగించుకోవచ్చు.

ఫీచర్ల విషాయనికొస్తే...

- టాబ్లెట్ బరువు 2.2 పౌండ్లు,

- 10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1366 x 768పిక్సల్స్),

- ఇంటెల్ వోక్ ట్రెయిల్ ప్రాసెసర్,

- 128జీబి సాలిడ్ స్టేట్ స్టోరేజ్ డ్రైవ్,

- ఇంటెల్ జీఎమ్ఏ 600 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

- 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

- 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

- యూఎస్బీ కనెక్టువిటీ,

- హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

మైక్రోసాఫ్ట్ వర్డ్ 7, మైక్రోసాఫ్ట్ వన్ నోట్, డామ్ పాట్ ప్లేయర్ వంటి ప్రోగ్రామ్ లను టాబ్లెట్ లో ముందుగానే ఇన్స్ టాల్ చేశారు. మార్కెట్లో ‘కూపా X11 Lux’ ధర అంచనా రూ.50,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot