ఒక టాబ్లెట్.. రెండు ఓఎస్ లు - ‘వ్యూ ప్యాడ్ 10’

Posted By: Staff

ఒక టాబ్లెట్.. రెండు ఓఎస్ లు -  ‘వ్యూ ప్యాడ్ 10’

ఆపిల్ ఐప్యాడ్ రాకతో కంప్యూటింగ్ వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులు ప్రస్తుత ఎలక్ట్రానిక్ రంగ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విశ్వాన్ని మన గుప్పెట్లో ఉంచుతూ అరచేతి సైజులో ఆవిష్కృతమైన టాబ్లెట్ పీసీలు ప్రస్తుత మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పలు కంపెనీలు ‘నువ్వా.. నేనా’ అంటూ పోటీ పడుతున్నాయి. ఈ పోటీ నేపధ్యంలో గత కొంత కాలంగా టాబ్లెట్ పీసీ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రానున్న కాలంలో ఈ టాబ్లెట్ పీసీల వ్యాపారం తాజా మైలు రాయిని అధిగమించటంతో పాటు రికార్డుల సృష్టిస్తుందిని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టాబ్లెట్ పీసీలలో పరిశీలిస్తే ఒకే హార్డ్ వేర్ పై రెండు ఆపరేటింగ్ వ్యవస్థలు పని చేస్తున్నాయి. అవను.. మనం ఇప్పుడు డ్యూయల్ ఆపరేటింగ్ వ్యవస్థతో పనిచేసే టాబ్లెట్ పీసీల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రత్యేకతలతో కూడిన టాబ్లెట్ పీసీని వ్యూసోనిక్ టెక్నాలజీ ‘వ్యూ ప్యాడ్ 10’ పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో, విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థలతో ‘వ్యూ ప్యాడ్ 10’ పని చేస్తుంది.

సామర్ధ్యమైన హార్డవేర్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న వ్యూ సోనిక్ టాబ్లెట్ పీసీ, ఆండ్రాయిడ్ 2.2, విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థలను సపోర్టు చేయటంతో పాటు, శక్తివంతమైన 1.6 GHz ప్రాసెస్సర్ కలిగి ఉంది. ఇక ‘వ్యూ ప్యాడ్ 10’ డిస్ ప్లే విషయానికి వస్తే 10.1 అంగుళాల వైశాల్యంతో టచ్ స్క్రీన్ స్వభావం కలిగి ఉంటుంది. Wi-Fi , Bluetooth కనెక్టీవిటీ, Micro SD స్లాట్ వంటి అంశాలు వ్యూ ప్యాడ్ 10లో మనకు దర్శనమిస్తాయి. అయితే ఈ టాబ్లెట్ పీసీలో పొందుపరిచిన కెమెరా మాత్రం నిరుత్సాహానికి గురి చేస్తుంది. 1.3 మెగా పిక్సల్ సౌలభ్యం కలిగిన కెమెరా, ఐప్యాడ్, ఇతన స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే నాణ్యమైన ఫోటోలను అందిచటంలో విఫలమవుతుంది.

ఇక ఆపరేటింగ్ వ్యవస్థలు విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 2.2 ‘వ్యూ ప్యాడ్ 10’ టాబ్లెట్ పీసీకి మైనస్ అని చెప్పొచ్చు... ఎందుకంటే పెద్ద డిస్ ప్లే స్ర్ర్కీన్ లకు సంబంధించి ఆండ్రాయిడ్ వ్యవస్థకు చెందిన హనీకాంబ్ వర్షన్ ఉపకరిస్తుంది. అయితే అతి పెద్ద డిస్ ప్లే సామర్ధ్యంతో కూడిన ‘వ్యూపాడ్10’ టాబ్లెట్ పీసీలో కొన్ని అప్లికేషన్ల వృధా అనే చెప్పొచ్చు. ఇక మరో ఆపరేటింగ్ వ్యవస్థ విండోస్ 7 విషయానికి వస్తే ఆండ్రాయిడ్ కన్నా మెరుగనే చెప్పొచ్చు. విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థకు సంబంధించి టచ్ స్కీన్ ఐకాన్లు టాబ్లెట్ పీసీకీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాని ఇక్కడొచ్చిన సమస్య ఏమిటంటే... విండోస్ 7 లోని పలు ఆప్లికేషన్లను టచ్ స్ర్కీన్ సాయంతో ఆపరేట్ చేయటం క్లిష్టతరంగా మారుతుంది. ఉదాహరణకు ఫోటో షాప్ అప్లికేషన్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot