కొత్త తరం గ్యాడ్జెట్!!

Posted By: Super

కొత్త తరం గ్యాడ్జెట్!!

 

అంతర్జాతీయ కంప్యూంటింగ్ పరికరాల బ్రాండ్ ‘లెనోవో’ (Lenovo) ధింక్ ప్యాడ్ X1 వర్షన్లో కొత్త తరం హైబ్రీడ్ ల్యాపీలను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇంటెల్ కోర్ i3,i5,i7 ప్రాసెసింగ్ వేరియంట్లలోఈ ల్యాపీలు లభ్యమవుతున్నాయి.

1366x768 పిక్సల్ రిసల్యూషన్ సామర్ధ్యం గల 13.3 అంగుళాల స్క్రీన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ల్యాపీలో పొందుపరిచిన డాల్బీ హోమ్ ధియోటర్ వ్యవస్థ క్లారిటీతో కూడిన నాణ్యమైన సౌండ్ అనుభూతిని కలిగిస్తుంది. 8జీబీ సామర్ధ్యం గల ర్యామ్ ను ఈ గ్యాడ్జెట్ సపోర్టు చేస్తుంది. స్టోరేజి అంశాలను పరిశీలిస్తే 160 GB, 128 GB SSDs మరియు 320 GB/250 GB హార్డ్ డ్రైల్ ఆప్షన్లను పొందుపరిచారు.

పరికరంలో ఏర్పాటు చేసిన బ్లూటూత్, వై-ఫై, హెచ్డీఎమ్ఐ పోర్టు, మినీ డిస్ ప్లే పోర్ట్, యూఎస్బీ 2.0,3.0 పోర్ట్సు, ఆప్షనల్ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సపోర్టు వంటి అంశాలు కనెక్టువిటీ వేగాన్ని మరింత బలపేతం చేస్తాయి.

ల్యాపీలో అనుసంధానం చేసిన digital-array మైక్రో ఫోన్, 4-in-1 మైక్రో కార్డ్ రీడర్, ఆన్ - బోర్ ఇతర్ నెట్ కనెక్షన్ వంటి ఫీచర్లు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. ‘ధింక్ ప్యాడ్ X1’లో అనుసంధానం చేసిన ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ 5.2 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. కేవలం 45 నిమిషాల్లో ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అత్యాధునిక హంగులతో డిజైన్ కాబడిన ‘ధింక్ ప్యాడ్ X1’ హైబ్రీడ్ వర్షన్ ల్యాపీ ప్రారంభ ధర రూ.60,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot