మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ110.... ప్రత్యేకతలేంటి?

Posted By: Prashanth

మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ110.... ప్రత్యేకతలేంటి?

 

మైక్రోమ్యాక్స్ రూపొందించిన సరికొత్త ఫాబ్లెట్ ‘మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2’ ఆన్‌లైన్ మార్కెట్లో రూ.9,999 ధరకు లభ్యమవుతోంది. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన ఈ డివైజ్‌ను సాహోలిక్ ఇంకా స్నాప్‌డీల్ వంటి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ఆఫర్ చేస్తున్నాయి. మైక్రోమ్యాక్స్ నుంచి ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన ఈ రెండవ తరం ఫాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా.......

బరువు ఇంకా చుట్టుకొలత: శరీర కొలత 17 x 76.5 x 9.7మిల్లీ మీటర్లు, బరువు వివరాలు తెలియాల్సి ఉంది.

డిస్‌ప్లే: 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ప్రాసెసర్: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: 3జీ, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ 2.0, వై-ఫై,

బ్యాటరీ: 2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై),

ధర: ధర రూ.9,999.

అనుకూలమైన అంశాలు....

డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఐపీఎస్ డిస్‌ప్లే టెక్నాలజీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర, నోటిఫికేషన్ ఎల్ఈడి, కెపాసిటివ్ బటన్ ఫీచర్.

ప్రతికూల అంశాలు:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (లోపించింది),

కెమెరా యవరేజ్ పనితీరు,

తక్కువ స్థాయి ఇంటర్నల్ మెమెరీ.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot