జూన్ చివరి నాటికి ‘ఫుల్ క్లారిటీ’!

Posted By: Staff

జూన్ చివరి నాటికి ‘ఫుల్ క్లారిటీ’!

 

అత్యాధునిక కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజానీకానికి చేరువచేయాలనే లక్ష్యంతో రూపొందించిన టాబ్లెట్ కంప్యూటర్ ‘ఆకాష్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆకాష్ రెండో వర్షన్ టాబ్లట్ ‘ఆకాష్-2’ ఈ నెలాఖరుకల్లా తుది మెరుగులు దిద్దుకోనుందని కేంద్ర టెలికాం, మానవ వనరుల శాఖా మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. డివైజ్ లో చేయ్యాల్సిన మార్పులు, పొందుపరచాల్సిన ఆధునిక ఫీచర్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ముంబయ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంలో మంత్రి ఈ అంశం పై స్పందించారు. ఆకాష్-2ను రానున్న ఐదు నుంచి ఏడేళ్లలో దేశంలోని అన్ని పాఠశాల, కళాశాల విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామనే ధీమాను వ్యక్తంచేశారు. ఆకాష్-2 రూ.1960 కి అందుబాటులో ఉంటుందన్నారు.

ఆకాష్-2 ఫీచర్లు (అంచనా):

7 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, కార్టెక్స్ ఏ8 700 మెగాహెడ్జ్ ప్రాసెసర్, హై డెఫినిషన్ వీడియో ప్రాసెసర్, వీజీఏ ఫ్రంట్ కెమెరా, హై క్వాలిటీ వీడియో రికార్డింగ్, 256 ఎంబీ ర్యామ్, 2జీబి ఫ్లాష్ మెమెరీ, ఎక్సటర్నల్ మెమరీ 32జీబి, జీపీఆర్ఎస్, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, డేటావిండ్ యూబీ సర్ఫర్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్, బ్యాటరీ స్టాండ్ బై 3గంటలు, రిటైల్ మార్కెట్లో ధర అంచనా రూ.3,000.

ఆకాష్ మొదటి వర్షన్ ప్రత్యేకతల:

* 7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480 పిక్సల్స్), * ధృడమైన టచ్ సామర్ధ్యం, * ర్యామ్ పరిమాణం 256 ఎంబీ, * 2జీబి ఇంటర్నల్ ఫ్లాష్ మెమరీ, * ఎక్స్‌ప్యాండబుల్ విధానం ద్వారా మెమరీని 32 జీబికి పెంచుకోవచ్చు, * జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, WLAN,* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * ఆండ్రాయిడ్ v2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం, * 366 MHz కోనెక్సంట్ ప్రాసెసర్, * గ్రాఫిక్ యాక్సిలరేటర్, * బ్యాటరీ బ్యాకప్ 3 గంటలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot