ఒక్క దెబ్బతో ప్రపంచానికి వేడి పుట్టించింది...?

Posted By: Super

ఒక్క దెబ్బతో ప్రపంచానికి వేడి పుట్టించింది...?

ప్రపంచపు అతిచవక టాబ్లెట్ కంప్యూటర్ ఆకాష్ మార్కెట్లో లాంఛ్ అయిన నాటి నుంచి ఆ విభాగంలో వేడి రాజుకుంది. ఇతర తయారీ కంపెనీల పోటీపడి మరి టాబ్లెట్ పీసీలను చవక ధరకే అందిస్తున్నాయి. పలు అప్‌డేటెడ్ ఫీచర్లతో ఆకాష్ - 2  మరో సారి విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. ఈ పీసీకి ప్రధాన ప్రత్యర్ధిగా బీఎస్ఎన్ఎల్ పెంటా ప్యాడ్ WS802C నిలిచినప్పటికి ధర విషయంలో తేలిపోయింది. వీటి ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిస్తే...

ఆకాష్-2:

7 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 2జీబి ఫ్లాష్ మెమెరీ, 256ఎంబీ ర్యామ్, 32జీబి ఎక్సటర్నల్ స్టోరేజ్, యూఎస్బీ, వై-ఫై, సిమ్ కార్డ్ స్లాట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, స్పీకర్స్, ఆడియో జాక్, స్టాండర్డ్ ఇన్‌బుల్ట్ బ్యాటరీ, ప్రకటించిన నెల ఫిబ్రవరి 2012, ధర రూ.3,000.

బీఎస్ఎన్ఎల్ పెంటా టీ-ప్యాడ్ WS802C:

8 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2 జిగాహెడ్జ్ ప్రాసెసర్, ఫ్రంట్ కెమెరా, 4జీబి ఫ్లాష్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్, 32జీబి ఎక్సటర్నల్ స్టోరేజ్, యూఎస్బీ, వై-ఫై (802.11 b/g), బ్లూటూత్, జీపీఆర్ఎస్, హెచ్‌డిఎమ్ఐ అవుట్, సిమ్ కార్ట్ స్లాట్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, స్పీకర్స్, ఆడియో జాక్, స్టాండర్డ్ లితియమ్ పాలీమర్ 3000mAh బ్యాటరీ, ప్రకటించిన నెల మార్చి 2012, ధర రూ.13,500.

క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఆకర్షిణీయమైన శైలిలో ఈ పీసీలను డిజైన్ చేశారు. ఆకాష్-2తో పోలిస్తే అదనంగా బ్లూటూత్, జీపీఎస్, హెచ్‌డిఎమ్‌ఐ ఫీచర్లను పెండా టీ-ప్యాడ్‌లో చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot