ఆకాష్ 2 టాబ్లెట్ జస్ట్ 1500లకే.. నవంబర్ 11 నుంచి అమ్మకాలు?

By Prashanth
|
Aakash 2 Tablet
ప్రపంచపు అతి చవక టాబ్లెట్ కంప్యూటర్ ఆకాష్ 2, నవంబర్ 11 నుంచి దేశీయ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయానా కేంద్ర టెలికం మంత్రి కపిల్ సిబల్ ఎకనామిక్ ఎడిటర్స్ సమావేశంలో వెల్లడించారు. ఆకాష్-2ను యూకే ఆధారిత డేటావిడ్ సంస్థ డిజైన్ చేసింది. పలు నివేదికల ప్రకారం, ఆకాష్-2 ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఫిర్మ్‌వేర్ పై రన్ అవుతుంది. 1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ప్రాసెసర్‌ను వినియోగించారు. బ్యాటరీ బ్యాకప్ 4 గంటలు. కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే. ఆకాష్-2 ధరను రూ.1500గా అంచనా వేస్తున్నారు. మరో మిలియన్ ఆకాష్ 2 యూనిట్లకు ఆర్డర్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికను ఏర్పాటు చేసినట్లు సిబల్ తెలిపారు. అయితే, ఆకాష్2 పనితీరు పై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని

నిర్థారించాల్సింది వినియోగదారులే.

 

ఆకాష్-2కు సవాల్‌గా నిలిచిన పలు టాబ్లెట్ పీసీల వివరాలు…

 

కోబియన్ ఐఎక్సఏ ట్యాబ్(Kobian iXA Tab):

విద్యార్ధి వర్గాలను టార్గెట్ చేస్తు డిజైన్ కాబడిన ఈ టాబ్లెట్ ధర రూ.3,999. వెబ్ సర్ఫింగ్, ఈ-మెయిల్ యాక్సిస్, వీడియో సపోర్ట్చ, ఈ-బుక్ రీడర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ గ్యాడ్జెట్‌లో ఉన్నాయి. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే: ఆండ్రాయడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై, రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్, 1గిగాహెర్జ్ కోర్ ప్రాసెసర్, 512ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

ఆటిట్యూడ్ దక్షా(Attitude Daksha):

ధర రూ.5,399. టెల్మోకో డెవలెప్మెంట్ ల్యాబ్స్ వారు ఈ కంప్యూటింగ్ డివైజ్‌ను కేరళ రాష్ట్రంలో ఆవిష్కరించారు. ఫీచర్లు: 7 అంగుళాల టాబ్లెట్, 5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, 1.2గిగాహెర్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 400మెగాహెర్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 3జీ డాంగిల్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్,

ఇంటరాక్టివ్ అప్లికేషన్స్.

విష్‌టెల్ ఐరా‌థింగ్, ఐరా‌థింగ్ 2(WishTel Ira Thing and Ira Thing 2):

విష్‌టెల్ ఐరాథింగ్ ధర రూ.4,000, అప్‌గ్రేడెడ్ ఐరాథింగ్ 2 ధర రూ.6,500. ఐరాథింగ్ 2 స్పెసిఫికేషన్‌లు: ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్జ్ ప్రాసెసర్, 512ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 7 అంగుళాల మల్టీటచ్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్, బ్యాటరీ బ్యాకప్ (బ్రౌజింగ్ టైమ్ 4 గంటలు), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, ప్రీలోడెడ్ టీవీ ఇంకా ఈ-న్యూస్ అప్లికేషన్.

జెన్ అల్ట్రా‌ట్యాబ్ ఏ100 (Zen UltraTab A100):

ధర రూ.5,999. జెన్ అల్ట్రాట్యాబ్ ప్రధాన ఫీచర్లు…….. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1.3 మెగా పిక్సల్ కెమెరా, 1.2గిగాహెర్జ్ ప్రాసెసర్, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్. ప్రత్యేక ఫీచర్: నెక్స్ట్ జనరేషన్ టీవీ అప్లికేషన్ (ఈ అప్లికేషన్ 100 లైవ్ టీవీ ఛానళ్లను సపోర్ట్ చేస్తుంది).

వామ్మీ 7(Wammy 7):

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ టచ్‌స్ర్కీన్, యూఎస్బీ పోర్ట్ 2.0, 3జీ డాంగిల్, ఆర్‌జే 45lAN కేబుల్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 1.2గిగాహెర్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ10 ఆల్ విన్నర్ ప్రాసెసర్,

512ఎంబీ డీడీఆర్3 ర్యామ్.

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో (Micromax Funbook Pro):

10 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), 1.2గిగాహెర్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డ్యూయల్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, వీజీఏ ఫ్రంట్ కెమెరా(వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు), హెచ్‌డిఎమ్ఐ అవుట్ పుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (యూట్యూబ్, టెక్స్ట్ట్ ఎడిటర్, ఆడోబ్ పీడీఎఫ్, ఫ్లాష్).

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X