ట్రయిల్ వేసిన తరువాతే..?

Posted By: Super

ట్రయిల్ వేసిన తరువాతే..?

ఆకాష్ సరికొత్త వర్షన్ టాబ్లెట్ కంప్యూటర్‌ను మే నుంచి ప్రయోగ ప్రాతిపదికన (ట్రెయిల్ బేసిస్)  ఉన్నత సాంకేతిక విద్యా సంస్థలకు సరఫరా చేయునున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి కపిల్ సిబాల్  సోమవారం తెలిపారు. ఐసీసీ నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ అంతరంగిక సమావేశంలో పాల్గొన్న సిబాల్ ఆ సందర్భంగా ఆకాష్-2 పై స్పందించారు.

ఈ ఆధునిక గ్యాడ్జెట్ పనితీరుకు సంబంధించి విద్యార్థుల నుంచి సేకరించిన  అభిప్రాయాల మేరకు వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభిస్తామని వ్యాఖ్యానించారు. లక్ష టాబ్లెట్ యూనిట్ లను విద్యార్థుల నిమిత్తం పంపిణి చేయునున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఆకాష్ -2 టాబ్లెట్ ఫీచర్లను పరిశీలిస్తే:

* మూడు గంటల  బ్యాకప్ నిచ్చే 3200mAh బ్యాటరీ,


* 700 మెగా హెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,


* సమర్ధవంతమైన టచ్ స్ర్కీన్,


* సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్స్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot