వాళ్లకు ముందరన్ని మంచి రోజులే..?

Posted By: Super

 వాళ్లకు ముందరన్ని మంచి రోజులే..?

 

ఆకాష్-2 టాబ్లెట్ కంప్యూటర్‌ను పొందిన, పొందబోతున్న వినియోగదారులకు ముందరన్ని మంచి రోజులే. ఈ పీసీని మరింత అప్‌గ్రేడ్ చేసేందుకు డేటా‌విండ్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా డివైజ్ ఆపరేటింగ్ సిస్టంను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి డివైజ్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. దీని స్థానంలో ఆండ్రాయిడ్ ఐస్‌‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంను అప్‌డేట్ చేస్తున్నట్లు మాచారం. మరో కొన్ని రోజుల్లో ఈ అప్‌డేట్ వర్తిస్తుంది. అత్యాధునిక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేష్‌లతో రూపుదిద్దుకున్న ఆకాష్-2 వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌కు సహకరిస్తుంది. పూర్తి‌స్థాయి సాంకేతిక వనరులతో డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్ పై కంప్యూటింగ్ అదేవిధంగా కమ్యూనికేషన్ అవసరాలను సమర్ధవంతంగా నిర్వహించుకోవచ్చు.

ఆకాష్-2 ఫీచర్లు:

7 అంగుళాల టచ్ స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం (ప్రస్తుతానికి),

కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

2జీబి ఫ్లాష్ మెమెరీ,

256ఎంబీ ర్యామ్,

32జీబి ఎక్సటర్నల్ స్టోరేజ్,

యూఎస్బీ,

వై-ఫై,

సిమ్ కార్డ్ స్లాట్,

ఆడియో ప్లేయర్,

వీడియో ప్లేయర్,

స్పీకర్స్,

ఆడియో జాక్,

స్టాండర్డ్ ఇన్‌బుల్ట్ బ్యాటరీ,

ప్రకటించిన నెల ఫిబ్రవరి 2012,

ధర రూ.3,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot