ఆకాష్ 2 vs మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా!

By Prashanth
|
Aakash 2 UbiSlate 7Ci vs Micromax Funbook Alpha


సామ్‌సంగ్, ఆపిల్ వంటి టెక్ దిగ్గజాలు ఓ వైపు అధికముగింపు టాబ్లెట్ కంప్యూటర్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేస్తుంటే మేమేమి తక్కువకాదంటూ దేశవాళీ బ్రాండులు పోటాపోటీగా బడ్జెట్ ఫ్రండ్లీ టాబ్లెట్ పీసీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా విడుదలైన చవక ధర టాబ్లెట్ ‘ఆకాష్-2’ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. యూకే ఆధారిత సంస్థ డేటావిండ్ ఈ డివైజ్‌ను తయారు చేసింది. ఈ ఆధునిక టాబ్లెట్ కంప్యూటర్‌లను ప్రత్యేక సబ్సిడీ పై విద్యార్ధులకు రూ.1130కి విక్రయించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆకాష్-2 లభ్యంకానుంది. ఆకాష్-2 కమర్షియల్ వర్షన్‌ను రూ.4,499 చెల్లించి డేటావిండ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. మరోవైపు టాబ్లెట్ తయారీ విభాగంలో దూసుకుపోతున్న మైక్రోమ్యాక్స్ తన ఫన్‌బుక్ లైనప్‌ను మరింత పటిష్టం చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ సిరీస్ నుంచి తాజాగా విడుదలైన ‘ఫన్‌బుక్ ఆల్ఫా’ ఆధునిక ఫీచర్లను కలిగి రూ.5,999 ధరలో లభ్యమవుతోంది. హోరాహోరిగా సాగుతున్న టాబ్లెట్ పోరులో భాగంగా ఈ రెండు గ్యాడ్జెట్‌‍ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా....

డిస్‌ప్లే.....

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ఆకాష్2: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్.......

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా: 1గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆకాష్2: డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, క్లాక్ వేగం 1గిగాహెడ్జ్,

ఆపరేటింగ్ సిస్టం..

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా: ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ఆకాష్2: ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా......

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా: వీజీఏ ఫ్రంట్ కెమెరా,

ఆకాష్2: వీజీఏ ఫ్రంట్ కెమెరా,

మెమెరీ....

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా: 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పొడిగించుకునే సౌలభ్యత, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

ఆకాష్2: 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పొడిగించుకునే సౌలభ్యత, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

కనెక్టువిటీ....

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా: వై-ఫై, 3జీ వయా డాంగిల్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0పోర్ట్,

ఆకాష్2: వై-ఫై, 3జీ వయా డాంగిల్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0పోర్ట్,

బ్యాటరీ.......

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా: 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ఆకాష్2: 3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధరలు....

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా: ధర రూ.5,999.

ఆకాష్2: ధర రూ.4,499.

ప్రత్యేకతలు.......

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా: ఆధునిక ఫీచర్లు,

ఆకాష్2: ఫన్‌బుక్ ఆల్ఫా‌లో ఒదిగి ఉన్న అన్ని స్పెసిఫికేషన్‌లు ఆకాష్ 2 యూబీస్లేట్‌లో ఉన్నాయి. ధర తక్కువ అలాగే మన్నికైన బ్యాటరీ బ్యాకప్.

తీర్పు......

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఆల్ఫా ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోంది. ఆకాష్2 యూబీస్లేట్ 7సీఐ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X