జనవరి 2014 నాటికి ఆకాష్ 4: కపిల్ సిబాల్

Posted By:

జనవరి 2014 నాటికి ఆకాష్ 4: కపిల్ సిబాల్

చవక ధర ట్యాబ్లెట్ ఆకాశ్-4 వచ్చే ఏడాది జనవరి నాటికి అందుబాటులోకి రానుందని కేంద్రం టెలికం, ఐటీ మంత్రి కపిల్ సిబల్ ఒక కార్యక్రమంలో తెలిపారు. కొత్త ట్యాబ్లెట్ ఏలా ఉండాలన్న తీరుతెన్నులను ప్రభుత్వం ఖరారు చేసిందని సిబల్ స్పష్టం చేసారు.‘‘ఆకాశ్ పై గురువారం మేం భేటి అయ్యాం. 4వ తరం ఆకాశ్ సిద్దమైంది'' అని సిబల్ ఢిల్లీలో శనివారం నిర్విహించిన టెలికామ్ సమ్మిట్ లో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 సంస్థలు భారత్ లో ఆకాశ్ ట్యాబ్లెట్ లను రూపొందించేందకు ముందుకొచ్చినట్లు ఆయన తెలిపారు.

ఆకాష్ 4 ఊహాజనిత స్పెసిఫికేషన్‌లు:

4జీ కనెక్టువిటీ,
4జీబి ఇన్‌బుల్ట్ మెమరీ,
బ్లూటూత్ కనెక్టువిటీ.

ఆకాష్ -2 స్పెసిఫికేషన్‌లు: 7 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, 3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot