మార్చి ఆఖరి నాటికి మార్కెట్లో ఆకాష్ 4

Posted By:

చవక ధర పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్ ఆకాష్ 4ను మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర టెలికాం శాఖా మంత్రి కపిల్ సిబాల్ సోమవారం తెలిపారు. వచ్చే నెలా లేదా నెలన్నర రోజుల్లో ఆకాష్ 4 ట్యాబ్లెట్ మార్కెట్లో లభ్యమవుతుందని, ఈ మోడ్రన్ ట్యాబ్లెట్ విలువ రూ.3,999 అని సిబల్ మీడియాతో పేర్కొన్నారు. ఈ ట్యాబ్లెట్‌ల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లైస్ అండ్ డిస్‌పోజల్స్ (డీజీఎస్‌డీ) ఇప్పటికే టెండర్లను పంపినట్లు ఆయన తెలిపారు.

మార్చి ఆఖరి నాటికి మార్కెట్లో ఆకాష్ 4

ఆకాష్ 4 కీలక స్పెసిఫికేషన్‌లు (అంచనా మాత్రమే):

క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ ట్యాబ్లెట్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
7 అంగుళాల ఎల్‌సీడీ తెర (రిసల్యూషన్ సామర్ధ్యం 800 x 480పిక్సల్స్),
5 పాయింట్ మల్టీటచ్ సపోర్ట్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
బ్లూటూత్ , వై-పై, యూఎస్బీ కనెక్టువిటీ,
ట్యాబ్లెట్ బరువు 500 గ్రాములు ఉండొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot