అదే జరిగితే ‘ఆపిల్’కు చుక్కెదురు..?

Posted By:

అదే జరిగితే ‘ఆపిల్’కు చుక్కెదురు..?

 

సౌలభ్యతను కోరుకుంటున్న నేటి తరం కంప్యూటింగ్ వినియోగదారులు స్లిమ్ గ్యాడ్జెట్‌లనే ఎంపిక చేసుకుంటున్నారు.  ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ల విషయంలో  మన్నికైన పనితీరు కలిగి తక్కువ బరువున్న వాటినే కోరుకుంటున్నారు. ఈ విధమైన డివైజ్‌లను కోరుకుంటున్న వారికి ఫస్ట్ ఛాయిస్ ‘ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్’. కాని ఈ డివైజ్ ధర వినియోగదారులకు అందనంత ఎత్తులో ఉంది.

ఈ పరిస్ధితుల పై సమీక్ష జరిపిన ఏసర్(Acer) నేటితరం కోరుకుంటున్న సౌలభ్యతలతో  ఆపిల్ మ్యాక్ బుక్ తరహా డివైజ్‌ను తక్కువ ధరకే అందించేందుకు  కసరత్తులు చేస్తోంది. అంతా అనుకున్నట్లే జరిగి ‘ఏసర్’ వ్యూహరచన ఫలిస్తే ‘ఆపిల్’కు  సిరీయస్ కాంపిటీషన్ తప్పదని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.

ఏసర్ విడుదల చేయుబోతున్న అల్ట్రా‌బుక్ స్ర్కీన్ 15 అంగుళాలు ఉంటుంది. ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను అత్యంగా గోప్యంగా ఉంచారు. వచ్చే  ఏడాది జనవరి 10 నుంచి 13 వరకు లాస్‌వేగాస్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ‘ఏసర్ కొత్త అల్ర్టాబుక్’ను లాంఛ్ చేయునున్నట్లు తెలుస్తోంది. ధర రూ.40,000లోపు ఉంటుందని అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot