లీకైన ఏసర్ ‘A200’ ఫీచర్లు!!

Posted By: Prashanth

లీకైన ఏసర్ ‘A200’ ఫీచర్లు!!

 

టాబ్లెట్ పీసీల పరిశ్రమ దినదినాభివృద్థి చెందుతున్న క్రమంలో దిగ్గజ కంపెనీల మధ్య పోటీ తారా స్థాయికి చేరింది. ఈ కోవలోనే ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తిదారు ఏసర్ (Acer) కొత్త ఎడిషన్ టాబ్లెట్ పీసీని బరిలోకి దింపేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసస్ తాజాగా విడుదల చేయబోతున్న ‘A200’ టాబ్లెట్ కంప్యూటర్ ఫీచర్లు లీకైనట్లు విశ్వసనీయ వర్గాల తెలుసింది. స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (ఎస్ఐజి) ద్వారా గుర్తింపు పొందిన ఏసర్ 200 టాబ్లెట్ పీచర్లు క్లుప్తంగా పరిశీలిద్దాం...

- టాబ్లెట్ స్ర్కీన్ సైజ్ 7 నుంచి 8.9 అంగుళాల మధ్య ఉండొచ్చు,

- ఈ పీసీకి సంబంధించి తాజాగా వెబ్ సైట్ లో ప్రత్యక్షమైన సమచారాన్ని పరిశీలిస్తే స్ర్కీన్ సైజు 10 అంగుళాలు ఉండొచ్చని తెలుస్తోంది,

- బేసిక్ కంట్రోల్ స్విచెస్, కర్వి, స్మూత్ ఎడ్జ్,

- ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఖచ్చితమైన సమచారం తెలియాల్సి ఉంది. అయితే అప్ గ్రేడ్ వర్షన్ అయిన ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టంను టాబ్లెట్లో నిక్షిప్తం చేయ్యవచ్చని తెలుస్తోంది.

- టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థను పీసీలో నిక్షిప్తం చేస్తున్నట్లు తెలుస్తోంది,

- టచ్ అనుభూతి, AMOLED టచ్ స్ర్కీన్, మల్టీ టచ్ సౌలభ్యత,

- ధర మరియు ఇతర స్పెసిఫికేషన్లు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot