Home
Computer

Acer నుంచి 15.6 అంగుళాల డిస్‌ప్లేతో గేమింగ్‌ ల్యాప్‌టాప్‌.. ఫీచర్‌లు, ధర, సేల్ వివరాలు..!

ప్రముఖ ల్యాప్‌ టాప్‌ ల తయారీ సంస్థ ఏసర్ తాజాగా మరో కొత్త ల్యాప్‌ టాప్‌ ఏసర్‌ ALG గేమింగ్‌ (Acer ALG Gaming laptop Launched in india) ను విడుదల చేసింది. ముఖ్యంగా గేమింగ్‌ ను దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాప్‌ టాప్‌ ను లాంచ్‌ చేసింది. ఈ ల్యాప్‌ టాప్‌ 15.6 అంగుళాల పుల్‌ HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు intel core i5 12 జెనరేషన్‌ ప్రాసెసర్‌ ను కలిగి ఉంటుంది. విండోస్‌ 11 హోమ్‌ OS పైన పనిచేస్తుంది.

ఏసర్‌ ALG గేమింగ్‌ ల్యాప్‌టాప్ ధర, సేల్‌ వివరాలు :
ఏసర్‌ ALG గేమింగ్‌ ల్యాప్‌ టాప్ స్టీల్‌ గ్రే రంగులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ గేమింగ్‌ ల్యాప్‌ టాప్‌ ధర రూ.56,990 గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ ను ఏసర్‌ ఈ- స్టోర్ మరియు అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఏసర్‌ ఎక్లూజివ్‌ స్టోర్‌ లోనూ అందుబాటులో ఉంటాయి.

Acer ALG Gaming laptop launched with key features in india

ఏసర్‌ ALG గేమింగ్‌ ల్యాప్‌ టాప్ స్పెసిఫికేషన్‌లు :
ఏసర్‌ ALG గేమింగ్‌ ల్యాప్‌ టాప్ 15.6 అంగుళాల పుల్‌ HD IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1920*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌, 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో లాంచ్‌ అయింది. ఈ ల్యాప్‌ టాప్‌ విండోస్‌ 11 హోమ్‌ OS పైన పనిచేస్తుంది. మరియు intel core i5- 12450H CPU, 16GB DDR4 ర్యామ్‌ ను కలిగి ఉంది.

2TB వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు..!
దీంతోపాటు 6GB Nvidia RTX GPU కూడా కలిగి ఉంటుంది. మరియు 512GB NVMe SSD స్టోరేజీని కలిగి ఉంటుంది. 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ ల్యాప్‌ టాప్‌ రెండు USB - 3.2 టైప్‌- C పోర్ట్‌లు, ఒక USB 2.0 టైప్‌ - A పోర్ట్, USB 3.2 టైప్ A పోర్ట్, Ethernet పోర్ట్, HDMI పోర్టును కలిగి ఉంటుంది.

120W ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ ఏసర్‌ ల్యాప్‌ టాప్‌ 120W ఛార్జింగ్‌ సపోర్టుతో 4 సెల్‌ 54Whr Li- ion బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ల్యాప్‌ టాప్‌ 1MP వెబ్‌ క్యామ్‌ మరియు ఇన్‌బిల్ట్‌ మైక్రోఫోన్‌ ను కలిగి ఉంటుంది. 1.99kg బరువు ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ ల్యాప్‌టాప్‌ బ్లూటూత్ 5.1, వైఫై 6 ను కలిగి ఉంటుంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Acer ALG Gaming laptop launched in india features price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X