సగమే విప్పింది..?

By Super
|
Acer


ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ బ్రాండ్ ‘ఏసర్’ విండోస్ ఆధారితంగా పనిచేసే టాబ్లెట్ పీసీలను, తాజాగా టైపూలో నిర్వహించిన కంప్యూటెక్స్ కార్యక్రమంలో ఆవిష్కరించింది .వీటి పేర్లు ‘ఐకోనియా టాబ్ డబ్ల్యూ510’, ‘ఐకోనియా టాబ్ డబ్ల్యూ 700’.విండోస్ అప్లికేషన్ స్టోర్‌లోకి ప్రవేశించే సౌలభ్యతతో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్లు ప్రివ్యూ వర్షన్ విండోస్ 8 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతాయి.

‘ఐకోనియా టాబ్ డబ్ల్యూ700’ 11.6 అంగుళాల హైడెఫినిషన్ తెరను కలిగి ఉంటుంది. 3 యూఎస్బీ పోర్లులను పీసీకి అమర్చారు. ‘ఐకోనియా టాబ్ డబ్ల్యూ510’ 10.1 అంగుళాల స్ర్కీన్ పరిమాణంతో 295 డిగ్రీ యాంగిల్ వ్యూను కలిగి ఉంటుంది. పొందుపరిచిన ట్రైమోడ్ ఫీచర్‌తో యూజర్ డివైజ్‌ను టచ్, టైప్, వ్యూ విధానాల్లో ఉపయోగించుకోవచ్చు. టైపింగ్‌కు మరింత అనువుగా డిటాచబుట్ కీబోర్డ్ డాక్‌ను ఈ డివైజ్ ద్వారా పొందవచ్చు. ఈ టాబ్లెట్ పీసీలకు సంబంధించి కొద్ది ఫీచర్లను మాత్రమే ఏసర్ వర్గాలు ప్రకటించాయి. పూర్తి స్థాయి కంప్యూటింగ్ స్పెసిఫికేషన్‌లతో ఏడాది చివరి నాటికి వీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

ఒలంపిక్స్ కోసం ఏసర్ స్పెషల్ ఎడిషన్:

లండన్‌లో నిర్వహించనున్న ఒలంపిక్స్ 2012 క్రీడా పోటీలను పురస్కరించుకుని ఏసర్ స్పెషల్ ఎడిషన్ టాబ్లెట్ కంప్యూటర్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. పేరు ‘ఏసర్ ఐకోనియా ఏ510’. వచ్చే నెలనాటికి ఈ స్పెషల్ ఎడిషన్ డివైజ్ యూకె మార్కెట్లో లభ్యం కానుంది. ఈ స్పెషల్ ఎడిషన్ గ్యాడ్జెట్ పై ఐదు ఒలంపిక వృత్తాలను డిజైన్ చేశారు. ఈ డిజైన్ యూజర్లలో ఒలంపిక్ క్రీడా స్పూర్తిని రెట్టింపు చేస్తుంది. డివైజ్‌లో లోడ్ చేసిన ట్రెయిల్ వర్షన్ యూరో స్పోర్ట్ ఛానల్ అప్లికేషన్ క్రీడాభిమానులకు మరింత లబ్ధి చేకూరుస్తంది. ఈ ఫీచర్ సౌలభ్యతతో యూజర్లు ఆటలకు సంబంధించి ప్రత్యక్ష లైవ్ కవరేజ్‌ను ఆస్వాదింవచ్చు. ఈ స్పెషల్ ఎడిషన్ టాబ్లెట్ ధర విషయానికొస్తే రూ.28,000గా అంచనా వేస్తున్నారు.

టాబ్లెట్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:

ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.3గిగాహెడ్జ్ ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఆడియో ప్లేయర్,

వీడియో ప్లేయర్,

వై-ఫై,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ.

ఒలంపిక్స్ స్పెషల్ ఎడిషన్ ఏసర్ ఐకోనియా ఏ510 టాబ్లెట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంభినేషన్‌లో డిజైన్ కాబడింది. అత్యాధునిక హంగులతో యూకె మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ స్మార్ట్ కంప్యూటింగ్ డివైజ్ టెక్నాలజీ ఆరాధికుల మదిలో ఒలంపిక్స్ పట్ల ఆసక్తిని రగిలించాలని కోరుకుందాం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X