Home
Computer

ఇండియాలో ఏసర్ అస్పైర్ 3 ల్యాప్‌టాప్ లాంచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు ఉన్నాయ్.. ధర రూ.15,000 లోపే!

ఇండియాలో మంచి ఫీచర్లతో బడ్జెట్ ల్యాప్‌టాప్స్‌ లభించడం చాలా అరుదు. అయితే Acer సంస్థ విద్యార్థులు, తక్కువ ధరల్లో ల్యాప్‌టాప్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని చౌక ధరల్లోనే బెస్ట్ ల్యాప్‌టాప్స్‌ను తీసుకొస్తోంది తాజాగా కోసం సరికొత్త Aspire 3 (2025) ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ పెద్దగా బరువు ఉండదు, మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది, ఎక్కువకాలం మన్నుతుంది. దీని ధర చాలా తక్కువ. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఏసర్ Aspire 3 ల్యాప్‌టాప్‌లో 11.6-అంగుళాల HD కంఫీవ్యూ LED-బ్యాక్‌లిట్ డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1366 x 768 పిక్సెల్స్‌. ఈ స్క్రీన్ కాంతిని తగ్గించడం ద్వారా కళ్ల అలసటను తగ్గిస్తుంది. ఇంటెల్ సెలెరాన్ N4500 ప్రాసెసర్, ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కార్డుతో ఈ ల్యాప్‌టాప్ వస్తుంది.

Acer Aspire 3 Laptop Launched in India at an Unbelievable Price Under Rs 15 000

దీనివల్ల బ్రౌజింగ్, వీడియోలు చూడటం, ఆన్‌లైన్ క్లాసులు వంటి సాధారణ పనులను సులువుగా చేసుకోవచ్చు. ఇందులో 8GB DDR4 ర్యామ్ ఉంది. అవసరమైతే దీన్ని 16GB వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే, ఇది 128GB, 256GB, 512GB లేదా 1TB PCIe NVMe SSD వంటి ఆప్షన్లలో లభిస్తుంది.

ఫైల్స్, ప్రాజెక్టులు, అప్లికేషన్లు స్టోర్ చేసుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఏసర్ అస్పైర్ 3 ల్యాప్‌టాప్‌లో సౌకర్యవంతమైన, మన్నికైన ఫీచర్లు చాలా ఉన్నాయి. వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్‌ల కోసం 720p HD వెబ్‌క్యామ్, ప్రైవసీ షట్టర్‌తో వస్తుంది. స్పష్టమైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

* చాలా బరువు తక్కువ

మైక్రోసాఫ్ట్ ప్రెసిషన్-సర్టిఫైడ్ టచ్‌ప్యాడ్ మల్టీ-టచ్ జెస్టర్‌లను సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, దీన్ని తేమను తట్టుకునేలా రూపొందించారు, కాబట్టి ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు కేవలం 1 కేజీ మాత్రమే, 16.8mm మందం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. ఇది విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

38Wh Li-ion బ్యాటరీతో 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. 3-పిన్ 36W AC అడాప్టర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB 3.2 Gen 1 పోర్ట్‌లు, USB టైప్-C పోర్ట్, HDMI పోర్ట్, మైక్రోSD కార్డ్ రీడర్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.

* ఫ్రీ లోడెడ్ యాప్స్

అలాగే, ఏసర్ కేర్ సెంటర్, క్విక్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్ ముందుగానే డౌన్‌లోడ్ అయి వస్తాయి. ఏసర్ అస్పైర్ 3 స్టీల్ గ్రే రంగులో లభిస్తుంది. ఒక సంవత్సరం క్యారీ-ఇన్ వారంటీతో వస్తుంది. ధర విషయానికి వస్తే, 8GB/128GB వేరియంట్ ధర రూ.14,990, 8GB/256GB మోడల్ ధర రూ.17,990, 8GB/512GB వెర్షన్ ధర రూ.19,990.

* ఇలా కొనండి

ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.15,990 ఉంది కానీ లిమిటెడ్ ఆఫర్‌లో రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఏసర్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుధీర్ గోయల్ మాట్లాడుతూ, Aspire 3 విద్యార్థులు, కాంపాక్ట్ ల్యాప్‌టాప్ కోరుకునేవారికి బాగుంటుందన్నారు.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X