Home
Computer

3D టెక్నాలజీ, 15.6 అంగుళాల డిస్‌ప్లే సహా సూపర్‌ ఫీచర్‌లతో ఏసర్‌ ల్యాప్‌టాప్‌.. ధర, సేల్‌ వివరాలు..!

ప్రముఖ ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ ఏసర్‌ తాజాగా Acer Aspire 3D 15 Spatiallabs ల్యాప్‌టాప్‌ను భారత్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌ 3D టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా గ్లాస్‌ల అవసరం లేకుండానే 3D లో చూసేందుకు వీలుంటుంది. దీంతోపాటు 4K రిజల్యూషన్‌లో 2D లోనూ చూసేందుకు వీలుంది. ఈ ఏసర్‌ కొత్త ల్యాప్‌టాప్‌ intel core i7 ప్రాసెసర్‌ మరియు Nvidia Geforce RTX 4050 GPU తో పనిచేస్తుంది.

ఏసర్‌ అస్పైర్‌ 3D 15 Spatiallabs ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ ఏసర్‌ ల్యాప్‌ టాప్ 1920*2160 పిక్సల్‌ రిజల్యూషన్‌ తో 15.6 అంగుళాల 4K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ల్యాప్‌ టాప్‌ SpatialLabs టెక్నాలజీని కలిగి ఉంటుంది.

Acer Aspire 3D 15 Spatiallabs laptop features

ఈ టెక్నాలజీ కారణంగా 2D నుంచి సులభంగా 3D లోకి మారేందుకు అవకాశం ఉంది. 2D లో 380 నిట్స్‌ గరిష్ట డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అదే 3D లో అడాబ్‌ RGB కలర్ గామట్‌ 100 శాతం కవరేజీతో వస్తుంది.

దీంతోపాటు ఈ ఏసర్‌ ల్యాప్‌టాప్‌ వినియోగదారుడి కంటి కదళికల ఆధారంగా పనిచేసేలా ఆప్టికల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు ఈ ల్యాప్‌టాప్‌ 13 వ జనరేషన్‌ Intel Core i7 ప్రాసెసర్‌ సహా Nvidia Geforce RTX 4050 GPU తో పనిచేస్తుంది. 32GB DDRS ర్యామ్‌ మరియు 2TB M.2 PCle SSD స్టోరేజీని కలిగి ఉంది.

Acer Aspire 3D 15 Spatiallabs laptop features

ఈ ఏసర్‌ ల్యాప్‌టాప్‌ 720 పిక్సల్‌ రిజల్యూషన్‌తో HD కెమెరాను కలిగి ఉంటుంది. 30fps తో వీడియో రికార్డు చేయవచ్చు. మరియు ఏసర్‌ టెంపరాల్‌ నాయిస్‌ రిడక్షన్‌ టెక్నాలజీ తో అందుబాటులోకి వస్తుంది. అంటే వీడియో రికార్డింగ్ సమయంలో అవసరం లేని సౌండ్ రికార్డు కాకుండా చూస్తుంది.

ఈ ల్యాప్‌టాప్‌ ప్యూరిఫైడ్‌వ్యూ, ప్యూరిఫైడ్‌ వాయిస్‌ మరియు తక్కువ కాంతిలోనూ మెరుగైన ఫోటోలు తీసేందుకు వీలుగా ఏసర్ టీఎన్‌ఆర్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. వీటితోపాటు DTS అల్ట్రాసౌండ్‌ మరియు ఏసర్‌సెన్స్ యాప్‌ను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా ఏసర్‌ ల్యాప్‌టాప్‌ HDMI 2.1 పోర్ట్‌, USB-C, వైఫై 6 వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు స్టీరియో స్పీకర్లను కలిగి ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ను వినియోగిస్తున్న సమయంలో చల్లగా ఉంచేందుకు మూడు కాపర్‌ హీట్ పైప్‌, రెండు ఫ్యాన్‌లతో కూడిన ట్విన్‌ఎయిర్‌ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఏసర్‌ అస్పైర్‌ 3D 15 Spatiallabs ల్యాప్‌టాప్‌ ధర, సేల్‌ :
ఈ ఏసర్‌ ల్యాప్‌టాప్‌ కేవలం బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.1,49,999 గా ఉంది. ఏసర్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌, ఏసర్‌ ఎక్లూజివ్‌ స్టోర్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Acer Aspire 3D 15 Spatiallabs laptop launched in india with 3D Technology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X