ఏసర్ ‘నోట్‌బుక్’ రూ.12000కే..!!

ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘ఏసర్’ నిత్యం వ్యాపర ఒత్తిడిలో తలమనకలయ్యే వ్యాపార వేత్తల కోసం ‘ఏసర్ ఆస్పైర్ AOD257’ పేరుతో సరికొత్త నోట్‌బుక్ పరికరాన్ని రూ.12000కే అందిస్తోంది. ప్రయాణ సందర్భాల్లో అత్యంత వేగవంతంగా పనులను చక్కదిద్దిపెట్టే ఈ మినీ ల్యాపీ అత్యుత్తమ ఫీచర్లతో వినియోగదారునికి పని భారం తగ్గిస్తుంది.
‘ఏసర్ ఆస్పైర్ AOD257’ ఫీచర్లు క్లుప్తంగా:
- విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా నోట్‌బుక్ విధులు నిర్వహిస్తుంది.
- 1.66GHz ఇంటెల్ ఆటమ్ N570 డ్యూయల్ ప్రొసెసర్, 250జీబీ హార్డ్‌డ్రైవ్, DDR3 ర్యామ్ వంటి అంశాలు పటిష్టమైన పని వ్యవస్థను కలిగి ఉంటాయి.
- 10.1 అంగుళాల నాణ్యమైన డిస్‌ప్లే సామర్ధ్యం కలిగి ఉండే నోట్‌బుక్ కేవలం 999 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.
- పొందుపరిచిన గ్రాఫిక్ మీడియా యాక్సిలరేటర్ వ్యవస్థ నాణ్యమైన గ్రాఫిక్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
- నోట్‌బుక్‌లో ఏర్పాటు చేసిన 0.3 వెబ్‌క్యామ్ వ్యవస్థ నాణ్యమైన మీడియో ఛాటింగ్‌కు ఉపకరిస్తుంది.
- అనుసంధానించిన స్పీకర్ వ్యవస్థ నాణ్యమైన సౌండ్‌ను అందిస్తుంది.
- మల్టీ - గెస్ట్యుర్ టచ్‌ప్యాడ్ వ్యవస్థ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.
- ఆధునిక వై-ఫై కనెక్టువిటీ వంటి అంశాలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి.
- ఏర్పాటు చేసిన 3 సెల్ లయాన్ బ్యాటరీ వ్యవస్థ, మన్నికైన 4 గంటల బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications