ఏసర్ ఆస్పైర్ హ్యాపీ నెట్‌బుక్, జంట అనుభూతులు కలయక!!

Posted By: Super

ఏసర్ ఆస్పైర్ హ్యాపీ నెట్‌బుక్, జంట అనుభూతులు కలయక!!


రెండు ఆపరేటింగ్ వ్యవస్థలతో పని చేసే ‘నెట్‌బుక్ ల్యాపీని ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘ఏసర్’ ప్రవేశపెట్టింది. మన్నికైన ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘ఏసర్ ఆస్పైర్ వన్ హ్యాపీ 2 నెట్‌బుక్’ కేవలం 2.5 పౌండ్ల బరువు మాత్రమే ఉంటుంది. వివిధ కలర్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ గ్యాడ్జెట్ ధరలు రూ.16,000 నుంచి ప్రారంభమవతున్నాయి.

- విండోస్ 7 మరియు ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ వ్యవస్ధలను ఈ నెట్‌బుక్‌లో లోడ్ చేశారు. వినయోగదారుడు అవసరాన్ని బట్టి కావల్సిన ఆపరేటింగ్ వ్యవస్థను బూట్ చేసుకోవచ్చు.

- గ్యాడ్జెట్‌లో పొందుపరిచిన ‘ఇంటెల్ ఆటమ్ N570’ ప్రొసెసింగ్ వ్యవస్థ సమర్ధవంతమైన పనితీరును కలిగి ఉంటుంది.

- 1జీబీ ర్యామ్ మరియు DDR 3 ర్యామ్ వ్యవస్థలు వేగవంతమైన కంప్యూటింగ్‌కు సహకరిస్తాయి.

- మన్నికైన బ్యాటరీ వ్యవస్థ 6.30 గంటల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

- అప్ గ్రేడెడ్ 3.0 బ్లూటూత్ వర్షన్, అత్యాధునిక వై-ఫై యుటిలిటీ వ్యవస్థలు వేగవంతమైన కమ్యూనికేషన్‌కు సహకరిస్తాయి.

- మెమరీని పెంచుకునే విధంగా ‘ఎస్టీ‌కార్డ్ స్లాట్’ సౌకర్యాన్ని నెట్‌బుక్‌లో కల్పించారు.

- ఆధునిక ఫీచర్లతో లభ్యమవుతున్న ‘ఏసర్ ఆస్పైర్ వన్ హ్యాపీ 2 నెట్ బుక్’ల ధరలు రూ.16,000 నుంచి ప్రారంభమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot