రెండు ల్యాప్‌టాప్‌లు... బోలెడన్ని ఉపయోగాలు!!!

Posted By:

రెండు ల్యాప్‌టాప్‌లు...  బోలెడన్ని ఉపయోగాలు!!!

 

అంతర్జాతీయంగా హై క్వాలిటీ  ల్యాప్‌టాప్‌లను ఉత్పత్తి చేస్తున్న  ప్రముఖ సంస్థలు ‘అసస్’, ‘ఏసర్’ సరికొత్త కోణంలో  బహుళ వినియోగాలకు ఉపయోగపడే విధంగా కంప్యూటింగ్ డివైజ్‌లును రూపొందించాయి. ఏసర్ ఆస్సైర్ ఎస్3, అసస్ జెన్ బుక్  UX31E మోడల్స్‌లో  రూపుదిద్దుకున్న ఈ ల్యాపీలు ఆడ్వాన్సుడ్ ఫీచర్లతో  టెక్ ప్రపంచాన్ని శాసించేందుకు రాబోతున్నాయి.

విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ డివైజుల్లో ఇంటెల్ కోర్ i5/i7 ప్రాసెసర్‌లను నిక్షిప్తం చేశారు. ఈ రెండింటిలో ర్యామ్ సామర్ధ్యం 4GB DDR3 SD, పొందుపరిచిన చిప్‌సెట్‌లలో స్వల్ప తేడాలను మనం గమనించవచ్చు.  ఎస్3‌లో ఇంటెల్  UM67 ఎక్స్‌ప్రెస్  చిప్‌సెట్‌ను ఏర్పాటు చేయగా  UX31Eలో  ఇంటెల్ QS67 ఎక్స్ ప్రెస్ చిప్‌సెట్‌ను దోహదం చేశారు.  ఏసర్ హార్డ్‌డ్రైవ్ పరిమాణ శక్తి 320 జీబి కాగా,  అసస్ హార్డ్‌డ్రైవ్ పరిమాణ శక్తి 256జీబి. స్ర్కీన్ డిస్‌ప్లే సైజులను  పరిశీలిస్తే  అసస్ జెన్‌బుక్ 13.3 అంగుళాలు, ఏసర్ ఆస్పైర్ 13.3 అంగుళాలు,  ఈ రెండు గ్యాడ్జెట్‌లు అల్ట్రాస్లిమ్ అదే విధంగా తక్కువ బరవు కలిగి ఉంటాయి.

కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే  ల్యాపీల్లో పొందుపరిచిన 802.11 b/ g/ n వై-ఫై, హెచ్డీఎమ్ఐ ఇన్‌పుట్ పోర్ట్, మినీ వీజీఏ, ఇతర్‌నెట్ , యూఎస్బీ కనెక్టువిటీ పోర్టులు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి.  ధరలను పరిశీలిస్తే  ఏసర్ ఆస్సైర్ ఎస్3  రూ.50,000,  అసస్ జెన్ బుక్  UX31E రూ.90,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot