మీ బంధాలను ధృడపరుచుకోండి ‘కొత్త ఏస్పైర్’తో..!!

Posted By: Staff

మీ బంధాలను ధృడపరుచుకోండి ‘కొత్త ఏస్పైర్’తో..!!

ప్రస్తుత ల్యాప్‌టాప్ తయారీ సంస్థలన్ని ‘అల్ట్రాబుక్’ల సెగ్మంట్ పై దృష్టికేంద్రీకరించాయి. ఇప్పటికే ‘లెనవో’, ‘తోషిబా’ వంటి దిగ్గజ బ్రాండ్లు తమ సొంత అల్ట్రా‌బుక్ పరికరాలను మార్కెట్లో విడుదల చేశాయి. అయితే ఇది కోవలో అడుగులు వేస్తున్న ఏసర్ సంస్థ ‘న్యూ ఏసర్ ఏస్పైర్ S3’ (Acer Aspire S3 ultra book) పేరుతో అల్ట్రాబుక్ పరికరాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఈ అధునాతన అల్ట్రాబుక్ పరికరంలో ఏసర్ పొందుపరిచిన ఫీచర్లు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. సెకండ్ జనరేషన్ ప్రొసెసర్లైన ఇంటెల్ కోర్ i3, i5, i7 వ్యవస్థలను ఏస్పైర్ లో ధృడపరిరచారు. ముందుగానే ప్రీలోడ్ చేసిన విండోస్ 7 హోమ్ ప్రీమీయం వ్యవస్థ గ్యాడ్జెట్ పనితీరును పర్యవేక్షిస్తుంది.

8జీబి ర్యామ్ వ్యవస్థ, సాటా (SATA) హార్డ్ డిస్క్ వ్యవస్థలు వినియోగదారుని పని వేగాన్ని మరింత పెంచుతాయి. 13.3 అంగుళాల ఎల్‌ఈడి బ్యాక్ లిట్ ఎల్సీడీ డిస్‌ప్లే వ్యవస్థ 1366 X 768 కలిగి నాణ్యమైన విజువల్స్ ను అందిస్తుంది. తక్కువ బరువుతో రూపుదిద్దుకున్న ఈ ల్యాపీ పరికరం చిక్లెట్ కీబోర్డుతో మల్టీ టచ్ ట్రాక్‌ప్యాడ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ సౌలభ్యత వినియోగదారుడికి మరింత మేలు చేకూరుస్తుంది.

పొందుపరిచిన ఆడ్వాన్స్‌డ్ కనెక్టువిటీ ఆప్షన్లు నెటవర్కింగ్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేయటంతో పాటు, డేటాను సులువుగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఆధునికరించని వై - ఫై డివైజ్, బ్లూటూత్ 4.0 వంటి వ్యవస్థలు సమచార వవ్యస్థను మరింత పటిష్టితం చేస్తాయి. ఏర్పాటు చేసిన బ్యాటరీ వ్యవస్థ 7 గంటల నిరంతర పవర్ సప్లైను వినియోగదారునికి అందిస్తుంది. అనుసంధానించిన వెబ్ కనెక్టువిటీ అంశాలు బ్రౌసింగ్‌ను వేగవంతం చేస్తాయి. ఏస్పైర్ ధరకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting