‘ఏసర్’ ల్యాపీ మన్నికైన ఫీచర్లతో తక్కువ ధరకే..!!

Posted By: Staff

‘ఏసర్’ ల్యాపీ మన్నికైన ఫీచర్లతో తక్కువ ధరకే..!!


అత్యుత్తమ బ్రాండ్‌గా అనుభవజ్ఞులచే గుర్తింపుపొందిన ‘ఏసర్’ మరో కొత్త ఆవిష్కరణకు తెర లేపనుంది. నూతన సాంకేతిక వనరులతో ఈ బ్రాండ్ సరికొత్త స్టైలిష్ ల్యాప్‌టాప్ పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘ఏసర్ ఆస్పైర్ టైమ్ లైన్ X5830T’ మోడల్‌గా వినియోగదారులకు మరింత చేరువుకానున్న ఈ గ్యాడ్జెట్ పటిష్ట బ్యాటరీ వ్యవస్థతో పాటు మన్నికైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

క్లుప్తంగా ‘ఏసర్ టైమ్ లైన్’ ఫీచర్లు:

- శక్తివంతమైన 2.10 GHz ఇంటెల్ కోర్ i3-2310 M ప్రొసెసింగ్ వ్యవస్థ సమర్థవంతమైన పనితీరు కలిగి ఉంటుంది.
- 6జీబీ ర్యామ్ వ్యవస్థ ల్యాపీ పనితీరును వేగవంతంగా నిర్వహిస్తుంది.
- 15.6 అంగుళాల స్క్రీన్ 1,366x768 పిక్సల్ రిసల్యూషన్ తో నాణ్యమైన డిస్ ప్లేను అందిస్తుంది.
- ల్యాపీలో పొందుపరిచిన హెచ్డీఎమ్ఐ పోర్టును టీవీకి అనుసంధానం చేసుకోవచ్చు.
- అదనంగా పొందుపరిచిన వీజీఏ పోర్టు, 2.0, 3.0 యూఎస్బీ పోర్టులు ఉపయుక్తంగా నిలుస్తాయి.
- ఇతర్ నెట్ పోర్ట్, ఎస్డీ‌కార్డ్ రీడర్, హెడ్‌ఫోన్ జాక్ తదితర సౌలభ్యతలు వినియోగదారుడికి మరింత ఉపయోగపడతాయి.
- అత్యాధునిక ‘కీబోర్డు’ వ్యవస్థ సులభమైన టైపింగ్‌కు అనువుగా ఉంటుంది.
- అనుసంధానించిన బ్యాటరీ వ్యవస్థ 2 గంటల 8 నిమిషాల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
- దేశ వ్యాప్తంగా పటిష్ట కస్టమర్ సర్వీస్ వ్యవస్థను కలిగి ఉన్న ‘ఏసర్’ ఈ సరికొత్త ‘టైమ్ లైన్’ ల్యాపీని రూ. 28,755కే ప్రవేశపెడుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot