‘ఏసర్’ పబ్లిక్ టాక్ ఏంటి..?

Posted By: Staff

‘ఏసర్’ పబ్లిక్ టాక్ ఏంటి..?

ప్రముఖ ల్యాప్‌టాప్‌ల తయారీదారు ‘ఏసర్’ మార్పు చేర్పులతో కొత్త ల్యాపీని మార్కెట్లో విడుదల చేసింది. మునపటి ‘ఆస్పైర్ టైమ్ లైన్ X’ను రీడిజైన్ చేసి కొత్త వర్షన్‌లో ‘ఏసర్ ఆస్పైర్ టైమ్ లైన్ X 5830TG’ వినియోగదారులకు అందించింది. విడుదలైన ల్యాపీ రివ్యూకు సంబంధించి విశ్లేషక వర్గాల నుంచి సానూకూల స్పందనలు వ్యక్తమవుతున్నాయి.క్లుప్తంగా ఈ గ్యాడ్జెట్ ఫీచర్లను పరిశీలిస్తే...

- ‘టైమ్ లైన్ X 5830TG’ 15.6 అంగుళాల స్క్రీన్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.

- 1366x768 పిక్సల్ రిసల్యూషన్ వ్యవస్థ మన్నికైన డిస్‌ప్లేను విడుదల చేస్తుంది.

- కేవలం 2.5 కిలోల బరవుండే ఈ ల్యాపీ బ్లూ, సిల్వర్, బ్లాక్ మ్యాటీ రంగుల్లో డిజైన్ కాబడింది.

- ఇంటెల్ కోర్ i5-2410M 2.30 GHz సాండీ బ్రిడ్జ్ ప్రాసెసర్ వేగవంతమైన పనివ్యవస్థను కలిగి ఉంటుంది.

- 640జీబీ హార్డ్ డ్రైవ్, DDR3 3GB ర్యామ్ వ్యవస్థలు పటిష్ట స్టోరేజి సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

- న్విడియా, ఆప్టిమస్ ఆడ్వాన్సడ్ గ్రాఫిక్ టెక్నాలజీని గ్యాడ్జెట్‌లో ఏర్పాటు చేశారు.

- విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ వ్యవస్థను ల్యాపీలో లోడ్ చేశారు.

- ప్రత్యేక ఫీచర్లను పరిశీలిస్తే నాన్ - రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థను ల్యాపీలో ఏర్పాటు చేశారు.

- ఏర్పాటు చేసిన బ్యాటరీ ఇండికేటర్ వ్యవస్థ ఛార్జింగ్ స్థాయిని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.

- 2 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యం వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.

- ఏర్పాటు చేసిన కీబోర్డు వ్యవస్థ సులువైన టైపింగ్‌కు ఉపకరిస్తుంది.

- వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న ‘ఏసర్ ఆస్పైర్ టైమ్ లైన్’ ల్యాపీ ధరలు మార్కెట్లో రూ.32,999 నుంచి ప్రారంభమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot