ఏసర్ కొత్త నోట్‌బుక్ ఆవిష్కరణ

నేటి తరానికి అవసరమైన కంప్యూటింగ్ అవసరాలను సమర్ధంతంగా తీర్చే అత్యుత్తమ ల్యాప్‌టాప్‌ను తాము లాంఛ్ చేసినట్లు ఏసర్ ప్రకటించింది. ఆస్పైర్ V3 సిరీస్ వస్తున్న ఈ నోట్‌బుక్ విభిన్నమైన వేరియంట్‌లలో లభ్యం కానుంది. డివైజ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు టెక్ వర్గాలతో పాటు మల్టీమీడియా వర్గాలకు మరింత దోహదపడతాయి. వివిధ స్ర్కీన్ సైజ్ పరిమాణాల్లో లభ్యం కానున్న ‘ఏసర్ ఆస్పైర్ వీ3 సిరీస్’ నోట్‌బుక్‌లలోని కీలక ఫీచర్లు........
* 14, 15.6. 17.3 స్ర్కీన్ పరిమాణాల్లో ఈ నోట్‌బుక్ లభ్యం కానుంది, (హై డెఫినిషన్ LED డిస్ ప్లే),
* వినియోగదారుడు తన వినియోగాన్ని బట్టి డివైజ్ లో i3,i5,i7 ప్రాసెసర్ లను నిక్షిప్తం చేసుకోవచ్చు,
* ఎన్-విడియా జీఫోర్స్ గ్రాఫిక్ కార్డ్ వ్యవస్థ,
* ల్యాపీని హైడెఫినిషన్ టీవీలు ఇతర ప్రొజెక్టర్ లకు అనుసంధానం చేసుకునే విధంగా హెచ్ డిఎమ్ఐ కనెక్టువిటీ,
* వై-ఫై,
* మెమరీని స్టోర్ చేసుకునేందుకు హార్డ్ డిస్క్ మరియు ఎస్ఎస్ డి వ్యవస్థలు,
* బ్లూటూత్, బ్లూరే డిస్క్ డ్రైవ్,
* డాల్బీ హోమ్ థియోటర్ సిస్టం (4.0),
ఇండియన్ మార్కెట్లో సంవత్సరం వారంటీతో లభ్యం కానున్న ఏసర్ ఆస్పైర్ వీ3 సిరీస్ నోట్ బుక్ ల ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








