ఏసర్ సీ7 ల్యాప్‌టాప్.. రూ.16,400!

Posted By:

ఏసర్ సీ7 ల్యాప్‌టాప్.. రూ.16,400!

 

ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ బ్రాండ్ ఏసర్, సీ7 క్రోమ్‌బుక్ పేరుతో ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్‌ను రూ.10,900 ధరకు గత నవంబర్‌లో మార్కెట్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డివైజ్‌ను అప్‌డేట్ చేస్తూ ‘సీ710-2605’ మోడల్‌లో కొత్త వర్షన్ సీ7 క్రోమ్‌బుక్‌ను ఏసర్ అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.16,400. ఈ అప్‌డేటెడ్ వర్షన్ ల్యాపీలో 500జీబి హార్డ్‌డిస్క్, 4జీబి ర్యామ్ ఇంకా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీను జత చేశారు.

అప్‌డేటెడ్ వర్షన్ సీ7 క్రోమ్‌బుక్ కీలక స్పెసిఫికేషన్‌లు:

సిలిరాన్ చిప్ (క్లాక్ వేగం - 1.10గిగాహెడ్జ్),

11.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్1366x 768పిక్సల్స్),

సినీక్రిస్టల్ వైడ్‌స్ర్కీన్ ఎల్‌సీడీ డిస్ ప్లే,

బూటప్ వేగం 18 సెకన్లు,

క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం,

100జీబి గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ (రెండు సంవత్సరాల పాటు),

500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,

4జీబి ర్యామ్,

1.3 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్,

యూఎస్బీ పోర్ట్స్ (3), హెచ్‌డిఎమ్ఐ పోర్ట్.

ధర రూ.16,400.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting