ఏసర్ సీ720 క్రోమ్‌బుక్@రూ.15,999

Posted By:

 ఏసర్ సీ720 క్రోమ్‌బుక్@రూ.15,999

2014 గూగుల్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌ను పురస్కరించుకుని ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ ఏసర్ తన 11 అంగుళాల ‘సీ720 క్రోమ్‌బుక్'ను మరోసారి ఇ-కామర్స్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.15,999. ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ (Snapdeal) ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఏసర్ మొట్టమొదటి సారిగా ఈ క్రోమ్‌బుక్‌ను 2013 అక్టోబర్‌లో విడుదల చేసింది. అప్పటి ధర రూ.22,999. ఒక సంవత్సరం అంతర్జాతీయ ట్రావెలర్స్ వారంటీతో లభ్యమవుతోన్న ఈ డివైస్ పై 1 టాబ్ గూగుల్ డ్రైవ్ స్పేస్‌తో పాటు రూ.2,999 విలువ చేసే స్కల్‌క్యాండీ హెడ్‌ఫోన్‌లను కంపెనీ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

ఏసర్ సీ720 క్రోమ్‌బుక్ కీలక స్పెసిఫికేషన్‌‌లు:

గూగుల్ 64బిట్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం,
11.6 అంగుళాల హైడెఫినిషన్ టీఎఫ్టీ ఎల్‌సీడీ బ్యాక్‌లైట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366x768పిక్సల్స్),
4వ జనరేషన్ ఇంటెల్ సెలిరాన్ 2957యూ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
3 సెల్ బ్యాటరీ (8.5 గంటల యూసేజ్ సమయంతో),
క్రోమ్‌బుక్ చుట్టుకొలత 288x204x19.05 మిల్లీ మీటర్లు,
బరువు 1.25 కిలో గ్రాములు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Acer C720 Chromebook Available at Rs. 15,999 via Snapdeal on GOSF 2014 . Read more in Telugu Gizot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot