ఏసర్ దీపావళి ఆఫర్లు.. ల్యాప్‌టాప్‌ల పై ప్రత్యేక బహుమతులు!

Posted By: Prashanth

ఏసర్ దీపావళి ఆఫర్లు.. ల్యాప్‌టాప్‌ల పై ప్రత్యేక బహుమతులు!

 

దీపావళి సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ ఏసర్ ‘సెలబ్రేషన్ ఆఫర్’ను తీసుకువచ్చింది. నవంబర్ 20వరకు కొనసాగే ఈ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఆస్పైర్ సిరీస్ నోట్‌బుక్‌ల కొనుగోళ్ల పై రెండు సంవత్సరాల అదనపు వారంటీని పొందవచ్చు. అలాగే ఆస్పైర్ ‘ఎస్’ సిరీస్, ‘ఎమ్’ సిరీస్ అల్ట్రాబుక్‌ల కొనుగోళ్ల పై రూ.6,900 విలువ చేసే ఫుజీఫిల్మ్ కెమెరా లేదా ఫిలక్స్ 5.1 స్పీకర్ సిస్టంను ఉచితంగా అందిస్తున్నట్లు ఏసర్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ అధికారి ఎస్ రాజేంద్రన్ తెలిపారు. ఈ ఆఫర్‌ పై ఉత్సకత కనబర్చే ఔత్సాహికులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. లింక్ అడ్రస్

చవక ధర ల్యాపీ ఏసర్ ఏవోడి 270 కీలక ఫీచర్లు:

10 అంగుళాల ఎల్ఈడి డిస్‌ప్లే స్ర్కీన్,

స్టాండర్డ్ కీబోర్డ్,

1.6గిగాహెట్జ్ క్లాక్ స్పీడ్ సామర్ధ్యం గల ఇంటెల్ ఆటమ్ డ్యూయల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్,

లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టం,

320 హార్డ్‌డిస్క్ డ్రైవ్,

ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,

0.3మెగాపిక్సల్ వెబ్ కెమెరా,

వైర్‌లెస్ లాన్ IEEE 802.11 b/g/n, గిగాబిట్ ఇతర్‌నెట్,

బ్లూటూత్ కనెక్టువిటీ,

యూఎస్బీ కనెక్టువిటీ,

6సెల్ బ్యాటరీ, 65వాట్ ఏసీ ఆడాప్టర్, 8 గంలట బ్యాకప్,

ధర రూ.15,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot