ఆ హిరోల్లో ఎవురు గొప్పో మీరే తేల్చండి..?

Posted By: Staff

ఆ హిరోల్లో ఎవురు గొప్పో మీరే తేల్చండి..?

 

టెక్ పరికరాల తయారీలో ఆ రెండు పేరుమోసిన కంపెనీలు, అధునాతన కంప్యూటింగ్ పరికరాలను మన్నికైన రీతిలో వినియోగదారులకు చేరువు చేసిన ‘సోని’, ‘అసస్’లు తాజాగా టాబ్లెట్ తరహా కంప్యూటర్ పీసీలను మార్కెట్లో విడుదల చేశాయి. ‘ఏసర్ ఐకోనియా A 500’, ‘సోని టాబ్లెట్ S’ వర్షన్లో అందుబాటులోకి వచ్చిన ఈ టాబ్లెట్ పరికరాలు ఆడ్వాన్సడ్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి.

క్లుప్తంగా వీటి ఫీచర్లు:

- ఆండ్రాయిడ్ ఆధారిత హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థను ‘ఏషర్ ఐకోనియా A 500’లో లోడ్ చేశారు.

- వేగవంతంగా స్పందించే న్విడియా (NVIDIA) టెగ్రా 2 ప్రాసెసింగ్ వ్యవస్థను ఈ రెండు టాబ్లెట్లలో ఏర్పాటు చేశారు.

- స్క్రీన్ అంశాలను పరిశీలిస్తే, ఏసర్ ఐకోనియా 10.1 అంగుళాల యాక్టివ్ మ్యాట్రిక్స్ TFT Color LCD డిస్ ప్లే, ‘సోని S’ 1280 x 800 పిక్సల్ రిసల్యూషన్ తో కూడిన 9.4 అంగుళాల పటిష్ట డిస్ ప్లేను కలిగి ఉంటుంది.

- కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, హెచ్డీఎమ్ఐ సౌలభ్యతను ఈ రెండు పీసీలలో కల్పించారు.

- బ్యాటరీ అంశాలను పరిశీలిస్తే ఏసర్ ఐకోనియా ‘3260 mAh 2- సెల్ లితియమ్ పాలిమర్’, సోని S ‘5000 mAh లితియమ్ ఐయాన్’ బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది.

- రెండు టాబ్లెట్ పీసీలలో 1జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్సప్యాండబుల్ మెమరీ సౌలభ్యత,

- బరువు విషయానికొస్తే ఏసర్ ఐకోనియా టాబ్లెట్ పీసీ 765 గ్రాములు, సోని టాబ్లెట్ S 468 గ్రాములు.

- కెమెరా అంశాలను పరిశీలిస్తే, ‘ఏసర్ ఐకోనియా A500’లో అత్యాధునిక వెబ్ క్యామ్ ను అమర్చారు. ‘సోని’లో 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా సౌలభ్యతను కలిగి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot