ఏసర్ ఐకోనియా 3జీ టాబ్లెట్@రూ.12,999

Posted By:

తైవాన్‌కు చెందిన ప్రముఖ బహుళ జాతీయ హార్డ్‌వేర్ కంపెనీ ఏసర్, ఐకోనియా ఎ1713 ( Iconia A1-713) పేరుతో సరికొత్త పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. సింగ్ సిమ్ వాయిస్ కాలింగ్, 3జీ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ 7 అంగుళాల బహుళ ఉపయోగకర కంప్యూటింగ్ పరికరం ధర రూ.12,999.

 ఏసర్ ఐకోనియా 3జీ టాబ్లెట్@రూ.12,999

ఏసర్ ఐకోనియా ఎ1713 ఫీచర్లు....

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1024x 600పిక్సల్స్),
సింగిల్ సిమ్ వాయిస్ కాలింగ్ సపోర్ట్ (3జీ కనెక్టువిటీతో),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసుకునే అవకాశం),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ (ఎంటీ8382) ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ కనెక్టువిటీ),
3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot