‘స్పైడర్ మ్యాన్’ కాదు ‘స్లైడర్ ట్యాబ్’..!!

Posted By: Super

‘స్పైడర్ మ్యాన్’ కాదు ‘స్లైడర్ ట్యాబ్’..!!

‘‘నిన్నమొన్నటి వరకు అద్భుత సాంకేతికతతో తీర్చిదిద్దిన ‘స్పైడర్ మ్యాన్’ సినిమా గురించి తెగ చెప్పుకునేవారు.. కాని నేడు ట్రెండ్ మారింది సాంకేతికతను ప్రత్యక్షంగా చూపిస్తున్న స్లైడర్ ట్యాబ్లెట్ పీసీల గురించి ఊరూరా చెప్పుకుంటున్నారు.’’

ప్రపంచ వ్యాప్తంగా చాక్లెట్లు.. బిస్కెట్లలలా అమ్ముడవుతున్న ‘టాబ్లెట్ పీసీలు’ కంప్యూటింగ్ వ్యవస్థలో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి. టాబ్లెట్ పరికరాలు కుప్పలు కప్పులుగా విడుదలవుతున్నప్పటికి వాటిల్లో అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్నవి మాత్రమే పోటీలో నిలుస్తున్నాయి. తమ లోపాలను తెలుసుకున్న తయారీ సంస్థలు వినూత్న రీతిలో టాబ్లెట్ పరికరాలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.

‘టాబ్లెట్ పీసీల’ ఒరవడిలో కొత్త మార్పుకు కారణమైన స్లైడర్ డిజైన్ టాబ్లెట్లకు ప్రస్తుత మార్కెట్లో మంచి డిమాండ్ నెలకుంది. ఈ స్లైడింగ్ వ్యవస్థను ప్రయోగత్మకంగా ప్రవేశపెట్టిన ‘అసస్’ వినియోగదారలకు చేరువకావటంలో సఫలీకృతమైంది. ఈ కోవలోనే బ్రాండ్ రూపొందించిన మరో సరికొత్త స్లైడర్ ట్యాబ్లెట్ ‘అసస్ ఈ ప్యాడ్ SL101’.

అయితే ఇదే సమయంలో ‘ఏసర్’, ‘అసస్’కు ధీటుగా మార్కెట్లో ‘ఏసర్ ఐకోనియా ట్యాబ్ A101’ను ప్రవేశపెట్టింది. వీటీ ఫీచర్లను పరిశీలిస్తే, ‘ఏసర్ ఐకోనియా’ టాబ్లెట్ 7 అంగుళాల స్క్రీన్ సైజు కలిగి 600 X 1024 పిక్సల్ ను సపోర్టు చేస్తుంది. ఎల్ సీ డీ సామర్ధ్యం కలిగిన టచ్ స్క్రీన్ వ్యవస్థను ఈ టాబ్లెట్ పీసీలో పొందుపరిచారు. యాక్సిలరోమీటర్, హెచ్‌డీ‌ఎమ్‌ఐ పోర్టు వంటి అంశాలను మరింత ఆధునికతతో పొందుపరిచారు. ట్యాబ్లెట్లో పొందుపరిచిన హెచ్‌డీ‌ఎమ్‌ఐ పోర్టును ప్రోజెక్టర్, టివీ వంటి పరికరాలను అనుసంధానం చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఎల్‌ఈడీ ఫ్లాష్ వ్యవస్థను కలిగి ఉంది.

‘అసస్ ఈ ప్యాడ్’ కెమెరా విషాయనికి వస్తే 5 మోగా పిక్సల్ రేర్ కెమెరా సామర్ధ్యాన్ని కలిగి ఉండటంతో పాటు 2 మోగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా సామర్ధ్యం కలిగి ఉంది. ఇక మెమరీ విషయానికి వస్తే ‘ఏసర్’ 8జీబీ ఇంటర్నల్ మెమరీ సామర్థ్యం కలిగి ఉంది. అయితే ఈ స్టోరేజిని మైక్రో ఎస్డీ విధానం ద్వారా 32జీబీకి పెంచుకోవచ్చు. ఈ పీసీలో అమర్చని వై - ఫై, బ్లూటూత్, యాఎస్బీ 2.0 వంటి అంశాలు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

ఇక ‘అసస్’లోనూ ‘ఏసర్’లో ఒదిగి ఉన్న అంశాలే పునరావృత్తమవుతాయి. వీటి ధరలను పరిశీలిస్తే ‘ఏసర్ ఐకోనియా ట్యాబ్ A101’ భారతీయ మార్కెట్లో రూ. 25,000 పలుకుతుంది. ‘అసస్ ఈ ప్యాడ్ స్లైడర్ SL 101’ 16 జీబీ సామర్ధ్యం గల టాబ్లెట్ పీసీ ధర రూ.18240, 32 జీబీ సామర్ధ్యం గల టాబ్లెట్ పీసీ రకం ధర రూ.24,000గా ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot