ఈ టాబ్లెట్ పీసీతో అన్ని చక చకా..?

Posted By: Prashanth

ఈ టాబ్లెట్ పీసీతో అన్ని చక చకా..?

 

పొర్టుబల్ సైజులో మన్నికగా కనిపిస్తున్న ఈ టాబ్లెట్ పీసీతో వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. అంతే కాదండోయ్!! సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా స్నేహితులతో ఛాట్ చేసుకోవచ్చు, గేమింగ్ అనుభూతులను సైతం రియాల్టీతో ఆస్వాదించవచ్చు. ఈ విధమైన ఉత్తమ ఫీచర్లు కలిగిన టాబ్లెట్ పీసీని ఏసర్ (Acer)వచ్చే వారం లాస్‌వేగాస్‌లో నిర్వహించే ‘కన్స్యూమర్ ఎలక్ర్లానిక్ షో’లో ఆవిష్కరించనుంది. ఏసర్ ఐకోనియా ఏ200గా రూపుదిద్దుకున్న ఈ స్టన్నింగ్ కంప్యూటింగ్ డివైజ్ అరిచేతిలో ప్రంపంచపు చిట్టాను చూపిస్తుంది.

పనితీరులో పెద్దన్న పాత్ర పోషించే ‘ఐకోనియా ఏ 200’ ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, * న్విడియా టెగ్రా డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * 10.1 అంగుళాల హైడెఫినిషన్ మల్టీ టచ్ డిస్‌ప్లే, * 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, * 8జీబి ఇంటర్నల్ మెమరీ (16జీబి వర్షన్ కూడా లభ్యం), * 1జీబి పటిష్ట ర్యామ్ వ్యవస్థ, * 8 గంటల బ్యాటరీ బ్యాకప్

స్లీక్ డిజైన్‌తో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ బరువు 700 గ్రాములు. 10 అంగుళాల డిస్‌ప్లే విజువల్స్‌ను స్పష్టతో కూడిన క్లారిటీతో విడుదల చేస్తుంది. మల్టీ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ను పూర్తి స్ధాయి అనుభూతులతో ఈ డివైజ్ అందిస్తుంది. పీసీలో నిక్షిప్తం చేసిన ప్రీలోడెడ్ గేమ్స్ ఆధ్యంతం రియాల్టీ ఫీల్‌కు లోను చేస్తాయి. టాబ్లెట్‌లో లోడ్ చేసిన టెగ్రా జోన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా మరికొన్ని ఆటలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ‘ఏసర్ ఐకోనియా ఏ 200’ రెండు వర్షన్‌లలో లభ్యం కానుంది. 8జీబి వర్షన్ ధర రూ. 17,000కాగా, 16జీబి వర్షన్ ధర రూ.18,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot